Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభShahrukh Khan : వజ్రాలతో ఇంటికి నేమ్ ప్లేట్ చేయించిన స్టార్ హీరో..

Shahrukh Khan : వజ్రాలతో ఇంటికి నేమ్ ప్లేట్ చేయించిన స్టార్ హీరో..

- Advertisement -

Shahrukh Khan : ముంబైలో షారుఖ్ ఖాన్ ఇల్లు చూడటానికి చాలా మంది వెళ్తుంటారు. ముంబైలో షారుఖ్ ఇల్లు మన్నత్ కూడా ఓ విజిటింగ్ ప్లేస్ లా మారింది. స్టార్ హీరోగా ఎదిగాకా ఎంతో ఇష్టపడి, భారీగా ఖర్చుపెట్టి అద్భుతమైన ఇంటిని కట్టుకున్నాడు షారుఖ్. ఆ ఇంటికి మన్నత్ అని పేరు పెట్టుకున్నాడు.

షారుఖ్ ఇల్లు మన్నత్ కి మరింత గ్రాండియర్ రావడానికి గతంలో వజ్రాలతో ఉన్న నేమ్ ప్లేట్ ని చేపించాడు షారుఖ్. వజ్రాలతో ఉండే ప్లేట్ పై మన్నత్ అని రాసి దాన్ని ఇంటిముందు పెట్టాడు. కానీ సెక్యూరిటీ కారణాల వల్ల గతంలో ఆ వజ్రాల నేమ్ ప్లేట్ ని తీసేశారు.

తాజాగా మరోసారి షారుఖ్ తన ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్ పెట్టించారు. దాదాపు 35 లక్షల విలువ చేసే వజ్రాల ముక్కలతో రెండు నేమ్ ప్లేట్స్ తయారు చేయించి ఒక దానిపై మన్నత్ అని, ఇంకో దానిపై ల్యాండ్ సెండ్ అని రాపించి ఇంటిముందు పెట్టాడు షారుఖ్. రాత్రిపూట ఆ వజ్రాలు మెరుస్తూ ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. దీంతో ఆ వజ్రాల నేమ్ ప్లేట్ ని చూడటానికి మరోసారి ప్రజలు షారుఖ్ ఇంటికి వెళ్తున్నారు. ఆ వజ్రాల నేమ్ ప్లేట్స్ తో గేట్ ముందు నించొని షారుఖ్ ఓ ఫోజ్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వజ్రాల నేమ్ ప్లేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News