Friday, October 18, 2024
Homeచిత్ర ప్రభShakunthalam : సమంత నుంచి ఆ సినిమా 3Dలో రాబోతుందట..

Shakunthalam : సమంత నుంచి ఆ సినిమా 3Dలో రాబోతుందట..

- Advertisement -

Shakunthalam : సమంత ఇటీవలే చాలా గ్యాప్ తర్వాత యశోద సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించి మంచి విజయం సాధించింది. ప్రస్తుతం తనకున్న ఆరోగ్య సమస్యలతో ఇంటివద్దే ఉంటూ చికిత్స తీసుకుంటుంది. తను చేయాల్సిన సినిమాలన్నీ కూడా షూటింగ్స్ ఆపేసింది సామ్. త్వరలో సమంత మరో సినిమాతో రాబోతుంది.

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో పురాణాల్లోని శాకుంతలం కథని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దుశ్యంతుడు-శాకుంతలం కథని అందంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో దుశ్యంతుడిగా మలయాళం నటుడు దేవ్ మోహన్ నటిస్తుండగా శకుంతలగా సమంత నటిస్తుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అర్హ సినీ ప్రవేశం చేయనుంది. శకుంతల చిన్నప్పటి పాత్రని అర్హ వేయనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది ఈ సినిమా.

అయితే ఈ సినిమా 3D లో రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత నీలిమ గుణ తెలిపింది. ఈ మేరకు తన ట్విట్టర్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి సమాధానమిచ్చింది. నీలిమ గుణ తన ట్వీట్ లో.. ”శాకుంతమ ఒక అందమైన ప్రేమ కథ. ప్రకృతి ఒడిలో అందంగా సాగే కథ. జంతువులు, ప్రకృతితో శకుంతల కలిసిన తీరు, దుశ్యంతుడితో శకుంతల ప్రేమ, అతని పరాక్రమం.. ఇలాంటివన్నీ 3D లోనే చూడాలి. అప్పుడు సినిమాని ఇంకా బాగా ఆస్వాదించగలరు” అని తెలిపింది. దీంతో సమంత సినిమా 3D లో వస్తుంది అనడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News