Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAadi Saikumar: ఆది సాయికుమార్ 'శంబాల' ట్రైలర్ రివ్యూ!

Aadi Saikumar: ఆది సాయికుమార్ ‘శంబాల’ ట్రైలర్ రివ్యూ!

Shambhala: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైన ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల ఎ మిస్టికల్ వరల్డ్’ ట్రైలర్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటుంది. దర్శకుడు యుగంధర్ ముని ఒక యూనిక్ పాయింట్‌ను ఎంచుకున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఒక మారుమూల గ్రామంలో ఉల్క పడటం వలన మొదలైన వింత ఘటనలు, వాటి వెనుక ఉన్న మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది అని అర్ధం అవుతుంది. ఈ ట్రైలర్‌కు సాయికుమార్ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ తోడై, స్టార్టింగ్ లోనే ట్రైలర్ హైప్ ను పెంచింది.

- Advertisement -

ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గ్రిప్పింగ్‌గా సాగింది. ఆది సాయి కుమార్ ఒక జియో సైంటిస్ట్ క్యారెక్టర్ లో నటిస్తూ, ప్రతి సంఘటన వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాన్ని నిరూపించడానికి ప్రయత్నిస్తాడు. ట్రైలర్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది, ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో రాజీ పడలేదని.

ALSO READ: Champion: శ్రీకాంత్ తనయుడు రోషన్ ‘ఛాంపియన్’ టీజర్ రివ్యూ!

‘శంబాల’ మూవీ ఆది సాయికుమార్ కెరీర్‌లోనే ఒక డిఫరెంట్ అటెంప్ట్‌ అని చెప్పవచ్చు. రొటీన్ కథలకు భిన్నంగా, మిస్టరీ, థ్రిల్, సైన్స్ వంటి అంశాలు అన్నిటిని కలిపి ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. పాత తరం నమ్మకాలకు, ఆధునిక సైన్స్‌కు మధ్య జరిగే ఈ సంఘర్షణ ఎలా ఉండబోతుందో చూడాలి అనుకుంటే. డిసెంబర్ 25 న క్రిస్మస్ వరకు ఆగాల్సిందే. ‘శంబాల’ ఆది సాయికుమార్ గట్టి కంబ్యాక్ మూవీ లాగా అనిపిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad