Sharwanand: శర్వానంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దీపావళి కానుకగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మోటో క్రాస్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బైకర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బైక్ రేసర్‌గా శర్వానంద్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. స్పోర్ట్స్ జాకెట్ ధరించి రేస్ ట్రాక్‌లో బైక్‌పై దూసుకుపోతున్నట్లుగా డిజైన్ చేసిన పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
బైకర్‌లో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. శర్వానంద్ తండ్రిగా రాజశేఖర్ కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్ మూవీలో శర్వానంద్ సరసన మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తండ్రీ కొడుకుల ఎమోషన్‌కు బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి దర్శకుడు అభిలాష్ కంకర బైకర్ సినిమాను రూపొందిస్తున్నాడట. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read – Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డబుల్ ట్రీట్ – ఒకే నెలలో రెండు సినిమాలు రిలీజ్
డైరెక్టర్‌గా అభిలాష్ కంకరకు బైకర్ రెండో సినిమా. సుధీర్‌బాబు హీరోగా గత ఏడాది రిలీజైన మా నాన్న సూపర్ హీరో సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు అభిలాష్ కంకర. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో శర్వానంద్ చేస్తున్న నాలుగో సినిమా ఇది. గతంలో ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడుతో పాటు రన్ రాజా రన్ సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు హిట్టయ్యాయి.
బైకర్‌తో పాటు శర్వానంద్ మరో మూవీ నారి నారి నడుమ మురారి అప్‌డేట్‌ను దీపావళి రోజు మేకర్స్ రివీల్ చేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. నారి నారి నడుమ మురారి సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సంపత్ నంది దర్శకత్వంలో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీ కూడా చేస్తున్నాడు శర్వానంద్. భోగి అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
Also Read – Bloody Romeo: నాని, సుజీత్ ప్రాజెక్ట్‌లో పూజా హెగ్డే ఫైనల్!


