Biker: సాధారణంగా ఫ్యామిలీ, లవ్ స్టోరీస్ ఎంచుకునే హీరో శర్వానంద్, ఈసారి తన జోన్‌ను పూర్తిగా మార్చుకొని ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పేరే ‘బైకర్’. ఈ సినిమాకు సంబంధించిన ‘ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్’ రీసెంట్ గా రిలీజ్ చేసింది. మూవీ టీమ్, రిలీజ్ అయిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. శర్వా ఈ సినిమా కోసం పడ్డ కష్టం, తన ట్రాన్స్ఫర్మేషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
‘బైకర్’ గ్లింప్స్ మొత్తం మోటార్‌సైకిల్ రేసింగ్ ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేసారు. ఈ సినిమా కథ 1990ల నుంచి 2000ల మధ్య ఉండే మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం శర్వానంద్ తన బాడీని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాడు. రేసర్‌కు ఉండాల్సిన పదునైన చూపు, కర్లీ హెయిర్తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అయితే రీసెంట్ గా శర్వా కొన్ని షర్ట్‌లెస్ పిక్స్ కూడా రిలీజ్ చేసాడు. ఇప్పుడు అర్థం అయ్యింది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సినిమా కోసమే అని. శర్వానంద్ కెరీర్‌లోనే ఇది చాలా ఇంటెన్స్ రోల్ ఉన్న సినిమా అని మాత్రం అర్ధం అవుతుంది.
గ్లింప్స్‌లో వినిపించిన ఒక డైలాగ్ సినిమా మొత్తం ఎలా ఉండబోతుంది చెప్పేసింది. “ఇక్కడ గెలవడం గొప్పకాదు… చివరిదాకా పోరాడటం గొప్ప.” ఈ డైలాగ్ ఈ సినిమా కేవలం రేసింగ్ గురించి మాత్రమే కాదు, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కూడా ఉండబోతుంది అని హింట్ ఇచ్చినట్టు అనిపించింది.
ALSO READ: Aadi Saikumar: ఆది సాయికుమార్ ‘శంబాల’ ట్రైలర్ రివ్యూ!
యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. అభిలాష్ కంకర అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శర్వానంద్‌కు జోడీగా మాళవిక నాయర్ నటిస్తోంది. జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రేసింగ్‌లో ఉండే వేగాన్ని, అద్భుతంగా చూపించింది. మొత్తంగా, ‘బైకర్’ గ్లింప్స్ చూస్తుంటే, శర్వానంద్ కెరీర్‌కు ఈ సినిమా ఒక గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశం ఉందని అర్ధమవుతుంది. మరి టీజర్ వచ్చాక ఈ అంచనాలు అన్ని కూడా రెట్టింపు అయ్యేలాగా అయితే ఉంది.


