Srinu Vaitla: వీవీ వినాయక్, శ్రీనువైట్ల, సురేందర్ రెడ్డి… ఒకప్పుడు వీరంతా టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్లు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఇండస్ట్రీని శాసించారు. ఈ దర్శకులతో సినిమాలు చేసే ఛాన్స్ కోసం టాప్ హీరోలు ఎదురుచూసేవారు. పరాజయాలు ఈ దర్శకుల కెరీర్‌ను దెబ్బతీశాయి. ప్రస్తుతం హీరోల కోసమే ఈ వెటరన్ డైరెక్టర్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ స్టార్ హీరోలతో ఈ దర్శకులు సినిమా చేయడం అసంభవమే. డోర్లు ఎప్పుడో మూసుకుపోయాయి. దాంతో యంగ్ హీరోల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
డైరెక్టర్‌గా కమ్‌బ్యాక్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న శ్రీనువైట్లకు ఎట్టకేలకు హీరో దొరికేశాడట. శర్వానంద్‌తో తన నెక్స్ట్ మూవీని శ్రీనువైట్ల చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనదైన కామెడీ స్టైల్‌లోనే నేటి ట్రెండ్‌కు తగ్గట్లుగా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను శ్రీనువైట్ల సిద్ధం చేశారట. కథ నచ్చడంతో శర్వానంద్ ఈ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.
శర్వానంద్, శ్రీనువైట్ల మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా సెట్స్‌పైకి రానుందట. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. తొలుత ఈ సినిమాను నితిన్‌తో చేయాలని శ్రీనువైట్ల అనుకున్నారట. కానీ బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ ఎఫెక్ట్‌తో నితిన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో శర్వానంద్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఢీ, రెడీ, దూకుడు వంటి బ్లాక్‌బస్టర్స్‌తో శ్రీనువైట్ల డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఓ సొంత మార్కును క్రియేట్ చేసుకున్నారు. ఆగడు తర్వాత శ్రీనువైట్ల డౌన్‌ఫాల్ మొదలైంది. ఆ తర్వాత చేసిన అమర్ ఆక్బర్ ఆంథోనీ డిజాస్టర్‌గా నిలవగా విశ్వం మాత్రం పర్వాలేదనిపించింది. శర్వానంద్ సినిమా శ్రీనువైట్ల కెరీర్‌కు కీలకంగా మారింది.
మరోవైపు శర్వానంద్ కూడా చాలా కాలంగా కమర్షియల్ హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. నారి నారి నడుమ మురారి, భోగి సినిమాలతో పాటు యూవీ క్రియేషన్స్‌లో ఓ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. నారి నారి నడుమ మురారి సినిమా సంక్రాంతికి విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌లో చేస్తున్న మూవీ డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి బైకర్ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read- Mithra Mandali Review: ‘మిత్ర మండలి’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్


