Sharwanand: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ పోరు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి మన శంకరవరప్రసాద్‌గారు, ప్రభాస్ రాజాసాబ్‌తోపాటు నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు, రవితేజ- కిషోర్ తిరుమల సినిమాలు ఉన్నాయి. తాజాగా సంక్రాంతి రేసులోకి మరో హీరో శర్వానంద్ వచ్చాడు. అతడు హీరోగా నటిస్తున్న నారి నారి నడుమ మురారి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ కావడంతో సంక్రాంతికి రిలీజ్ చేయడమే మంచిదనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు హీరోయిన్లు…
నారి నారి నడుమ మురారి సినిమాకు సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరినట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారట. ఈ సినిమాకు మాస్ జాతర డైరెక్టర్ భాను భోగవరకు కథను అందించారు. బాలకృష్ణ సూపర్ హిట్ టైటిల్‌ను శర్వానంద్ మూవీకి ఫిక్స్ చేయడంతో ఫ్యాన్స్‌లో సినిమా పట్ల క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటికే నారి నారి నడుమ మురారికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read- Bigg Boss Telugu 9: ఎంట్రీతోనే షాక్ ఇచ్చిన ఫస్ట్ కామనర్ సోల్జర్ కళ్యాణ్
ఏజెంట్, భోళా శంకర్…
నిర్మాతగా అనిల్ సుంకరకు హిట్టు దక్కి ఐదేళ్లు దాటింది. అతడు నిర్మించిన గత సినిమాలు భోళా శంకర్, ఏజెంట్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. అనిల్ సుంకరకు భారీగా నష్టాలను తెచ్చిపెట్టాయి. నారి నారి నడుమ మురారి తిరిగి తనను సక్సెస్ ట్రాక్ ఎక్కించే మూవీ అవుతుందని అనిల్ సుంకర ఆశలు పెట్టుకున్నారు.
సంపత్ నందితో…
ప్రస్తుతం నారి నారి నడుమ మురారితో పాటు సంపత్ నందితో భోగి అనే సినిమా చేస్తున్నాడు శర్వానంద్. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ మాస్ యాక్షన్ కథాంశంతో ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు అభిలాష్ కంకర దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నాడు శర్వానంద్.
Also Read- Heart Attack : వినాయక నిమజ్జనంలో విషాదం: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన కానిస్టేబుల్


