Srinu Vaitla: టాలీవుడ్‌లో కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు ఖరారైనట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్‌లో త్వరలో ఒక సినిమా సెట్స్‌పైకి రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనుంది. ఈ కథ మొదట హీరో నితిన్ చెయ్యాల్సింది, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ శర్వానంద్ చేతికి వచ్చింది. శర్వానంద్ కథ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట.
శ్రీను వైట్ల తన పాత స్టైల్‌లోనే, నేటి ట్రెండ్‌కు తగినట్లుగా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. ఈ సినిమాకు ‘సామజవరగమన’ సినిమాకు పనిచేసిన నందు కథ అందించినట్లు తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకుడిగా చివరిగా చేసిన సినిమా ‘విశ్వం’. గోపీచంద్‌తో రూపొందించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ‘ఆగడు’ తర్వాత వరుస అపజయాలతో శ్రీను వైట్ల కెరీర్ వెనకపడినప్పటికీ, ఆయన బ్రాండ్ కామెడీ కోసం ప్రేక్షకులు ఇంకా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/nara-rohit-marriage-date-fixed-with-actress-shirish-october-30/
శర్వానంద్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.
బైకర్: శర్వానంద్ ‘బైకర్’ మూవీ. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో శర్వానంద్ మోటార్‌సైకిల్ రేసర్‌గా కనిపించనున్నాడు. 1990లు, 2000ల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది అని తెలుస్తుంది.
నారీ నారీ నడుమ మురారి: ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది.
భోగి: సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/venkatesh-role-in-chiranjeevi-manasankar-varaprasad/
మొత్తానికి, ఒకప్పుడు హిలేరియస్ కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీను వైట్ల, ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్న శర్వానంద్‌తో కలిసి పనిచేయబోతుండటం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రేజీ కాంబో నుంచి అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.


