Saturday, February 1, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam February 1st Episode: శౌర్య ఆపరేషన్‌కు ఇంకా నాలుగు గంటలే సమయం.. డబ్బులు...

Karthika Deepam February 1st Episode: శౌర్య ఆపరేషన్‌కు ఇంకా నాలుగు గంటలే సమయం.. డబ్బులు ఎవరు ఇస్తారు?

ఈరోజు ఎపిసోడ్‌లో దీప హాస్పిటల్‌లో కార్తిక్ కోసం ఎదురుచూస్తుంటే ఈలోపు వస్తాడు. అప్పుడు దీప వచ్చారా ఆపరేషన్‌కు ఇంకా నాలుగు గంటలే టైం ఉంది డబ్బులు కట్టారా అని నర్సు ఇప్పటికే చాలా సార్లు అడిగింది అంటుంది. డబ్బులు కోసం వెళ్లారు గా ఏమైంది అంటే డబ్బులు కట్టేసాను అంటాడు. డబ్బులు ఎలా వచ్చాయి అంటే రాత్రి నుంచి కాశీ నేను తిరుగుతున్నాము నాలుగు లక్షలే దొరికాయి అవి కట్టేసాను మిగతావి కుడా కట్టేద్దాం అంటాడు. ఎలా బాబు అంత డబ్బు ఇంకో నాలుగు గంటల్లో దొరికేవి అంటుంది దీప.

- Advertisement -

మరోవైపు శౌర్య ఇంజక్షన్ చేయించుకోనని ఏడుస్తుందని నర్సు చెప్తే లోపలికి వెళ్తారు. శౌర్య ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. పడుకుంటుంటే తాత కళ్లోకి వస్తున్నాడు. తాత దగ్గరకు వెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను తాత దగ్గరికి వెళ్లిపోతానా, మరి కలెక్టర్ ఎలా అవుతాను అంటూ మాట్లాడుతుంది. అప్పుడు దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. కార్తిక్ నిన్ను నేను బతికించుకుంటాను నీ ప్రతి కలా నేను తీరుస్తాను అంటాడు.

డాక్టర్ పిలిచి ఇంకా బిల్లు కట్టలేదు, నువ్వు తెలుసు అనే కారణంతో ఇంతవరకూ ట్రీట్‌మెంట్ చేసాము. మీరు నాలుగు లక్షలు కడితే ఇప్పటి వరకూ చేసిన దానికే సరిపోదు. ఇంక డబ్బులు కట్టేదాక ట్రీట్‌మెంట్ చేయము అని చెప్పేస్తాడు. కార్తిక్ బ్రతిమాలితే డాక్టర్ నాలుగు గంటలే టైం లేదంటే ఆపరేషన్ జరగదు అనని చెప్పేస్తాడు. కార్తిక్ నిస్సహాయతతో ఏడుస్తూ బాధపడతాడు.

మరోవైపు దాసును చూడటానికి స్వప్న వాళ్ల అమ్మ కావేరి వస్తుంది. స్వప్న మీ ఆయన ఎక్కడ అని అడిగితే ఈలోపు ఎవరో డోర్ కొడితే స్వప్న వెళ్లి డోర్ తీస్తుంది. కావేరి కావాలనే ఇంట్లో ఫ్రూట్స్ మర్చిపోయి వస్తే అవి తీసుకొని శ్రీధర్ దాసు ఇంటికి వచ్చేలా చేస్తుంది. ఇక అలా ఇంట్లోకి వచ్చిన శ్రీధర్ దాసుని ఏలా ఉంది ఇప్పుడు అని అడుగుతుంది. బాగోగులు చెప్తే సరే బాగా చూసుకోండి అని చెప్తాడు.

మరోవైపు అనసూయ, కాంచన గుడిలో శౌర్య పేరు మీద పూజ చేయించడానికి వచ్చి మొక్కుకుంటారు. కాశీ ఏమో సుమిత్ర, దశరథ దగ్గరకు వెళ్లి శౌర్య గురించి నిజం చెప్తాడు. డబ్బులు దొరకక బావ ఏమి చేయలేక బాధపడుతున్నాడు అంటే సుమిత్ర ఎలా అయినా మనం సాయం చేయాలి మావయ్యకు ఏదొకటి చెప్పి ఒప్పించండి అంటుంది. దశరథ నాన్నను ఒప్పిద్దాం అంటాడు. దీప నా జీవితాన్ని కాపాడింది, ఇప్పుడు దాని కూతురు బ్రతుకు పోయేలా ఉంది నేను ఎలా సాయం చేయాలి. లేకపోతే దీప మొహం నేను చూడగలనా అంటుంది. జ్యోత్స్న మాత్రం దీప ఫోన్ కోసం ఎదురుచూస్తుంది. దీప తప్ప అందరూ ఫోన్ చేస్తుంటే సీరియస్ అవుతుంది. పారిజాతం వచ్చి ఏమైంది అలా ఉన్నావు అంటే అక్కడ హాస్పిటల్‌లో ఈవిడ పెట్టిన డీల్ గురించి చెప్తుంది. అప్పుడు పారిజాతం ఏంటి దీప తాళిని కొనడానికి సిద్ధం అయ్యావా అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News