Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభShiva rajkumar: సీరియస్ లుక్‌లో శివన్న.. 'పెద్ది' మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ రిలీజ్

Shiva rajkumar: సీరియస్ లుక్‌లో శివన్న.. ‘పెద్ది’ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ రిలీజ్

Shiva rajkumar look in Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

- Advertisement -

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ శివన్న పుట్టినరోజు సందర్భంగా మూవీ యూనిట్ ఆయన లుక్‌ను విడుదల చేసింది. ఈమేరకు హ్యాపీ బర్త్‌డే డియర్‌ శివన్న అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. గౌర్నాయుడు అనే పాత్రలో ఆయన కనిపించనున్నారని తెలిపింది. ఈ పోస్టర్‌లో చాలా సీరియస్‌గా శివన్న కనిపిస్తున్నాడు. పెద్ద మీసాలు పెట్టుకుని గ్రామ పెద్ద తరహాలో ఆయన లుక్ ఉంది. దీంతో ఈ పోస్టర్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది.

వాస్తవ సంఘటనల ఆధారంగా గ్రామీణ నేపథ్యంలో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ ఉండనుంది. వృద్ధి సినిమాస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్‌, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వ‌చ్చే ఏడాది చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: OG నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పండ‌గే!

కాగా చెర్రీ గత సినిమా గేమ్ ఛేంజర్ డిజాస్టర్ కావడంతో ఈ మూవీపైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లుగానే చరణ్ తన లుక్‌ను మార్చుకున్నాడు. పల్లెటూరి కుర్రాడిగా రగ్గడ్‌ లుక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad