Monday, February 10, 2025
Homeచిత్ర ప్రభKannappa: శివ శివ శంకరా.. కన్నప్ప నుంచి తొలి పాట వచ్చేసిందోచ్..!

Kannappa: శివ శివ శంకరా.. కన్నప్ప నుంచి తొలి పాట వచ్చేసిందోచ్..!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. కన్నప్ప ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ పంచుకుంటూ.. మూవీపై క్యూరియాసిటీ పెంచుతున్నారు.

- Advertisement -

ఈ క్రమంలో తాజాగా కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్ ‘శివ శివ శంకర’ (Shiva Shiva Shankaraa) సాంగ్ విడుదల చేశారు. ఈ పాటని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీ రవిశంకర్ గురూజీ ఈ పాటను లాంచ్ విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని తెలియజేస్తూ.. సాంగ్ లింక్ షేర్ చేశారు విష్ణు. ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. పాటను విజయ్ ప్రకాశ్ పాడారు.

మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో ఈ స్టోరీలో పలువురు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ కాస్ట్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించగా.. అక్షయ కుమార్, కాజల్ శివపార్వతులుగా నటించారు. మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు తదితర పాత్రలు పోషించారు. మంచు విష్ణు కుమార్తెలు, కుమారుడు కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నారు. అవ్రా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కలెక్షన్ మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News