Gummadi Narsaiah: గుమ్మడి నర్సయ్య… ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ప్రజా మనిషిగా పేరు తెచ్చుకున్న గుమ్మడి నర్సయ్య ఖమ్మం జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా గెలిచినా కూడా సామాన్య జీవితాన్నే గడిపారు గుమ్మడి నర్సయ్య. ఇప్పటికీ ఎక్కువగా సైకిల్‌పైనే తిరుగుతుంటారు. నిజాయితీ, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచిన గుమ్మడి నర్సయ్య జీవితం వెండితెరపైకి రాబోతుంది. గుమ్మడి నర్సయ్య పేరుతో రూపొందుతోన్న ఈ బయోపిక్‌లో కన్నడ అగ్ర హీరో శివరాజ్‌కుమార్ టైటిల్ పాత్రలో నటిస్తున్నాడు.
బుధవారం గుమ్మడి నర్సయ్య బయోపిక్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పంచెకట్టులో సైకిల్ పట్టుకొని శివరాజ్‌కుమార్ కనిపిస్తున్నారు. భుజంపై ఎర్రటి కండువా… సైకిల్‌పై పార్టీ జెండా ఉంది. పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో అసెంబ్లీ కనిపిస్తోంది. ఫస్ట్ లుక్‌తో పాటు ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఎమ్మెల్యేలు అందరూ కార్లలో అసెంబ్లీకి వస్తుంటే గుమ్మడి నర్సయ్య మాత్రం సైకిల్‌పై వచ్చినట్లుగా చూపించారు. ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గుమ్మడి నర్సయ్య బయోపిక్‌కు పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read – Bigg Boss Bharani: దివ్వెల మాధురి గేమ్ గురించి దువ్వాడ ఏమన్నారంటే?
తెలంగాణ పొలిటికల్ లీడర్ పాత్రలో కన్నడ స్టార్ హీరో నటించడం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. గుమ్మడి నర్సయ్య పాత్రకు శివరాజ్‌కుమార్‌ను ఎంచుకోవడం మంచి నిర్ణయం అని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తెలుగు హీరోలతో ఈ బయోపిక్ చేస్తే బాగుండేదని అంటున్నారు.
త్వరలోనే ఈ బయోపిక్‌కు సంబంధించి షూటింగ్‌తో పాటు ఇతర వివరాలను ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. గుమ్మడి నర్సయ్య బయోపిక్‌కు సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నాడు. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం.
గుమ్మడి నర్సయ్య బయోపిక్‌తో పాటు తెలుగులో రామ్‌చరణ్ పెద్ది మూవీలో శివరాజ్‌కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్‌చరణ్ గురువుగా గౌర్నాయుడు అనే క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. 2026 మార్చి 27న ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రిలీజ్ కాబోతుంది. తమిళంలో రజనీకాంత్ జైలర్ 2లో నటిస్తున్నారు శివరాజ్‌కుమార్.
Also Read – Netflix Subscription: జియో యూజర్లకు పండగే..ఈ చీపెస్ట్ ప్లాన్లతో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!


