Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభShobana : కేదార్‌నాథ్‌‌లో చిక్కుకుపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్..

Shobana : కేదార్‌నాథ్‌‌లో చిక్కుకుపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్..

- Advertisement -

Shobana : ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన నటిగా, క్లాసికల్ డ్యాన్సర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది. 90వ దశకంలో అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటూ క్లాసికల్ డ్యాన్సర్ గా పాఠాలు చెప్తూ లైఫ్ ని గడిపేస్తుంది శోభన.

ఇటీవల శోభన ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రమైన కేదార్‌నాథ్‌కు వెళ్లారు. కేదార్‌నాథ్‌ ఎప్పుడూ మంచుతోనే ఉంటుంది. ఇక అక్కడి వాతావరణ పరిస్థితులని ఎవరూ అంచనా వేయలేరు. శోభన కేదార్‌నాథ్‌ దేవాలయాన్ని సందర్శించుకున్న అనంతరం తిరిగి వద్దామనుకుంటే అక్కడ వాతావరణ పరిస్థితులు బాగోలేవు. దీంతో శోభన అక్కడి వాతావరణం గురించి చెబుతూ ఓ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

శోభన ఈ వీడియోలో మాట్లాడుతూ.. ”కేదార్‌నాథ్‌ లో వాతావరణం చాలా కఠినంగా ఉంది. పొగమంచు చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల నాకు జలుబు కూడా చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా మేము వెళ్లాల్సిన హెలికాప్టర్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం మేము దాని కోసమే ఎదురుచూస్తున్నాము. మంచు తగ్గాక, హెలికాఫ్టర్ రాగానే బయలుదేరుతాము. మళ్ళీ వివరాలని అప్డేట్ చేస్తాను” అని తెలిపింది. దీంతో అభిమానులు, నెటిజన్లు మీరు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News