Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభShobhana: విలక్షణ నటి శోభన

Shobhana: విలక్షణ నటి శోభన

బొమ్మల్లా ఉండే హీరోయిన్స్ అందరూ మాటకారులు కారు.  కానీ మిగతా బ్యూటీల్లా డంబ్ గా ఉండరు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, చాలా పద్ధతైన హీరోయిన్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న పాత తరం హీరోయిన్ శోభన్. తనకు నచ్చితేనే సినిమాలు చేస్తారు, లేదంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తారు ఈ సీనియర్ హీరోయిన్ శోభన.  52 ఏళ్లు దాటినా సింగిల్ గా ఉంటూ, తనకు నచ్చిన పని మాత్రమే చేస్తూ,హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిన శివంగి ఆమె.  అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో ఆమెపేరు వినిపించినా, కుండబద్ధలు కొట్టినట్టు మాట్లాడి తన మార్క్ ను చాటుకునే యాక్ట్రెస్ శోభన.

- Advertisement -

అప్పట్లో మంచి స్టార్డం..

80, 90ల్లో హీరోయిన్ గా మంచి స్టార్డం ఎంజాయ్ చేసిన వారిలో శోభన ఒకరు.  బెస్ట్ యాక్ట్రెస్ గా రెండుసార్లు నేషనల్ అవార్డ్ గెలిచారు శోభన.  సీరియస్ ఇష్యూస్ పై చాలా క్లారిటీతో రెస్పాండ్ అయ్యే తత్వం ఉన్న నటిగా శోభన పేరొందారు.  పెళ్లితో వచ్చే స్పెషల్ హ్యాపినెస్ ఏం లేదని ఆమె చెబుతూ బిజీగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఓ లాంగ్వేజ్ లో శోభన యాక్ట్ చేస్తూనే ఉంటారు.  ప్రపంచంలో ఏదో ఒక మూలన ఆమె డ్యాన్స్ షోలు నడుస్తూనే ఉంటాయి.  ఆమె ఎప్పుడూ న్యూస్ మేకరే.  జస్ట్ కమర్షియల్ సినిమాలను మాత్రమే నమ్ముకుని ఇండస్ట్రీలోకి రాలేదు.  ఆర్ట్ మూవీస్, స్టోరీ ఓరియెంటెడ్ మూవీస్ ఆమె చాలా ఇష్టంగా చేస్తారు.  ఫెమినిజం రిలేటెడ్ మూవీస్ ఆమె ప్రయారిటీ ఇస్తారు. 

కేరళ కుట్టి

1970, మార్చ్ 21న కేరళలో పుట్టారు శోభన.  డ్రీమ్ గర్ల్ హేమ మాలిని శోభనను ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు.  అకంప్లిష్డ్ భరతనాట్యం డ్యాన్సర్ గా శోభన అప్పటికే పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్నా.  తన బంధువులు చాలామంది ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నప్పటికీ ఆమెకు ఎప్పుడూ ఇండస్ట్రీ మీద క్రేజ్ లేదు.  క్లాసికల్ డ్యాన్స్ తను ప్రాక్టీస్ చేసుకుంటూ డ్యాన్స్ షోలు చేయటం మాత్రమే తన కెరీర్ గా మార్చుకుని, తన పర్సనల్ అండ్ ప్రొఫెషన్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చారు ఆమె.

ప్యాన్ ఇండియా స్టార్

తమిళ్, తెలుగు, మళయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా యాక్ట్ చేసిన శోభన తన మాతృభాష మళయాళానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు.  యాక్టర్స్ కు క్లాసికల్ డ్యాన్స్ రావటమంటే అదో పెద్ద ప్లస్ పాయింట్. ఈజీగా యాక్ట్ చేస్తారని శోభన ఎప్పుడూ చెబుతారు. మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఇంగ్లీష్ మూవీలో రేవతి డైరెక్షన్ లో యాక్ట్ చేసి నేషనల్ అవార్డ్ గెలిచారు.  శోభన ఇప్పటివరకు సింగిల్ గా ఉండేందుకు లవ్ ఫెయిల్యూర్ కారణమని మాలీవుడ్ లో చెబుతుంటారు.  మళయాళ యాక్టర్ ను ఆమె ప్రేమించింది. అయితే ఆయన మోసం చేయటంతో ఇక పెళ్లి చేసుకోకుండా శోభన అలాగే ఉండిపోయారని మళయాళం యాక్టర్స్ చెబుతుంటారు.  ఆమధ్య ఓ పాపను అడాప్ట్ చేసుకుని, పాపను హ్యాపీగా పెంచుకుంటున్నారు శోభన.  డ్యాన్స్, పాపే లోకంగా ఆమె ప్రెజెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భాషల్లో 200 కు పైగా సినిమాల్లో యాక్ట్ చేసిన హీరోయిన్ శోభన.  నారీ నారీ నడుమ మురారి, బాలగోపాలుడు, రౌడీ అల్లుడు, అల్లుడుగారు, ఎప్రిల్ 1 విడుదల లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగులోని అందరు టాప్ హీరోలతో ఆడి పాడారు శోభన.

నాగార్జునతో బిగ్ బ్రేక్

నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమాతో శోభనకు మంచి ఇమేజ్ వచ్చింది.  విక్రం సినిమాతో తెలుగులో శోభనకు మంచి బ్రేక్ వచ్చింది.  విక్రం కంటే ముందే తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసినా అంత పాపులారిటీ రాలేదు.  అందుకే చాలామంది శోభన ఫస్ట్ మూవీ విక్రం అనుకుంటారు.  యాక్ట్రెస్, డ్యాన్సర్, కొరియోగ్రఫర్ గా ఆమె కొనసాగిస్తున్న ఇన్నింగ్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఉంది.  తనతో పాటు తెలుగులో యాక్ట్ చేసిన ఓ సీనియర్ హీరో ఆమెను టార్చర్ పెడితే, తెలుగు ఇండస్ట్రీకి పర్మినెంట్ గా గుడ్ బై కొడుతున్నట్టు శోభన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.  తాను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పటం శోభన స్పెషాలిటీ.  పైగా హీరోయిన్ అంటే స్కిన్ షో చేసి జస్ట్ రెండు పాటలు నాలుగు సీన్స్ కు ఎందుకు పరిమితం కావాలని ఇండస్ట్రీని నిలదీసిన ధైర్యవంతురాలు. అలాంటి రోల్స్ ప్లే చేయనని, కావాలంటే సినిమాలే వదులుకుంటానని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.   మంచి రోల్స్ వస్తే కానీ ఆమె యాక్ట్ చేయటానికి కాల్ షీట్స్ ఇవ్వటం లేదు.  కానీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం ఆమె పాపం అన్నీ కష్టాలే చూశారు.  చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు శోభన.  పలు వెబ్ సిరీస్లు, సీరియల్స్, డాక్యుమెంటరీ, షార్ట్ ఫిలిమ్స్ లో కూడా శోభన యాక్ట్ చేశారు.

చైల్డ్ ఆర్టిస్ట్ కం హీరోయిన్

చైల్డ్ ఆర్టిస్ట్ గా శోభన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  హీరోయిన్ అయ్యాక కూడా ఎడాపెడా సినిమాలు చేసేయ్య లేదు.  చైల్డ్ ఆర్టిస్ట్ గా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ గెలిచారు శోభన.  1985లో ఆమె ఏకంగా వన్ ఇయర్ లో 16 సినిమాలు చేశారు.  ప్రైవేట్ చానెల్స్ లో టెలికాస్ట్ అయిన డ్యాన్స్ షోలకు కూడా ఆమె జడ్జ్ గా పనిచేశారు.   సీరియల్స్, డ్యాన్స్ బేస్డ్ రియాల్టీ షోల్లో కనిపించే శోభన ఫ్యాన్స్ కు రెగ్యులర్ గా టీవీల్లో కనిపిస్తుంటారు.  శోభన పూర్తిపేరు శోభన చంద్రకుమార్ పిళ్లై.   చిన్నప్పటినుంచే క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టపడిన శోభన 20 ఏళ్లకే మంచి డ్యాన్సర్ గా ఇండిపెండెంట్ గా షోస్ ఇస్తూ కొరియోగ్రఫీ కూడా చేసేస్థాయికి ఎదగటం హైలైట్. 

14 సార్లు బెస్ట్ యాక్ట్రెస్

కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్, కేరళ గవర్నమెంట్ ఇచ్చే కళారత్న అవార్డ్, 3 భాషల్లో 14సార్లు బెస్ట్ యాక్ట్రెస్ కేటెగెరీలో నామినేషన్స్, తమిళ్ నాడు స్టేట్ కళైమామణి అవార్డ్ తోపాటు ఎన్నో లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు అందుకున్నారు యాక్ట్రెస్ శోభన.  పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు.  శోభన దగ్గర డ్యాన్స్ నేర్చుకోవటానికి చాలామంది వస్తారు.  డ్యాన్స్ వీడియోలు, డ్యాన్స్ క్లాసులు ఇదే ప్రస్తుతం ఈమె లోకం.   చెన్నైలో 1994 నుంచి కళార్పన అనే డ్యాన్స్ స్కూల్ రన్ చేస్తున్నారు శోభన.   వీలైనంత ఎక్కువ మందికి క్లాసికల్ డ్యాన్స్ నేర్పడమే ఈ స్కూల్ టార్గెట్.  క్లాసికల్ డ్యాన్స్ లో పాపులర్ అయిన ట్రావెన్ కోర్ సిస్టర్స్ కు ఈమె మేనకోడలు కూడా.  పాతతరం నటి సుకుమారికి, హీరో వినీత్ కు కూడా ఈమె దూరపు చుట్టం.  ఇలా ఇంకా శోభన రిలేటివ్స్ చాలా మంది సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాఆమె మాత్రం ఈ వెలుగు జిలుగులకు దూరంగా పీస్ఫుల్ గా ఉంటున్నారు.

మైఖెల్ జాక్సన్ తో..

జర్మనీలోని మ్యూనిచ్ లో జరిగిన ప్రెస్టీజియస్ మైకేల్ జాక్సన్ అండ్ ఫ్రెండ్స్ అనే కాన్సర్ట్ లో మైఖేల్ జాక్సన్ తో కలిసి శోభన డ్యాన్స్ చేశారు.  డ్యాన్స్ లైక్ ఎ మ్యాన్, ఎ లిటిల్ డ్రీమ్, మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఇంగ్లీష్ సినిమాల్లో శోభన యాక్ట్ చేశారు. జీవితమంటే డ్యాన్స్ అని భావించే ఆమె నృత్యమనే కళకే తన జీవితం అంకితం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News