Sobhita Dhulipala: పెళ్లి తర్వాత సినిమాలకు స్మాల్ గ్యాప్ ఇచ్చిన అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ్ల మళ్లీ కెమెరా ముందుకు రాబోతుంది. ఓ కొత్త సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న శోభిత సెట్స్‌లో గరిటె పట్టింది. తన వంట చేయడంలో తనకున్న టాలెంట్‌ను చూపించింది.
సెట్ లైఫ్…
తాను వంట చేస్తున్న ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శోభిత. ఈ ఫొటోలకు బేసిక్ హ్యూమన్ స్కిల్స్ అనే క్యాప్షన్ జోడించింది. సెట్ లైఫ్ అంటూ పేర్కొన్నది. బెండకాయలు కట్ చేస్తూ.. సాంబార్ ప్రిపేర్ చేస్తూ ఈ వీడియోలలో కనిపించింది. నువ్వు చేసిన వంటల రుచి చూడటానికి ఎదురుచూస్తున్నాను అంటూ శోభిత పోస్ట్‌కు నాగచైతన్య కామెంట్ పెట్టాడు.
శోభిత పోస్ట్‌తో పాటు నాగచైతన్య రిప్లై చూసి అక్కినేని ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. శోభితలో ఈ టాలెంట్ కూడా ఉందా అని కామెంట్స్ పెడుతున్నారు. నాగచైతన్యకు తగ్గ భార్య అనిపించుకుందని పేర్కొంటున్నారు. నాగచైతన్య లక్కీ అంటూ చెబుతున్నారు. మీకు వంట చేయడం వచ్చా అక్కా అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శోభితా రియాక్ట్ అయ్యింది. మూడ్ ఉన్నప్పుడే చేస్తా చెల్లి అంటూ రిప్లై ఇచ్చింది. మరికొందరు నెటిజన్లు మాత్రం సమంత కంటే శోభిత బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత వంట చేసిన దాఖలాలు లేవని చెబుతున్నారు.
గత ఏడాది పెళ్లి…
రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న నాగచైతన్య, శోభిత గత ఏడాది పెళ్లిచేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహ వేడుక జరిగింది. నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి కాగా.. శోభితకు మొదటిది. సమంతను ప్రేమించి పెళ్లిచేసుకున్న నాగచైతన్య మనస్పర్థల కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చారు.
https://www.instagram.com/p/DOGguEsk_8w/
అచ్చ తెలుగు అమ్మాయి…
అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత బాలీవుడ్ సినిమాలతో కెరీర్‌ను మొదలుపెట్టింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన రమన్ రాఘవ్ 2.0 మూవీతో హీరోయిన్‌గా మారింది. తెలుగులో అడివి శేష్‌తో గూఢచారి, మేజర్ సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించింది. మంకీ మ్యాన్ మూవీతో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఎచ్చింది శోభిత. సినిమాల్లో ఎక్కువగా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది. ప్రస్తుతం తెలుగులోనే శోభిత ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా వివరాలను మాత్రం శోభిత తన పోస్ట్‌లో వెల్లడించలేదు.
Also Read- Venki – Trivikram Movie: కేజీఎఫ్ హీరోయిన్‌తో వెంకటేష్ రొమాన్స్ – త్రివిక్రమ్ ప్లానింగ్ అదిరిందిగా!


