Friday, July 5, 2024
Homeచిత్ర ప్రభShock to Rashmika: పాపం రష్మిక.. షాక్ ఇచ్చిన బాలీవుడ్

Shock to Rashmika: పాపం రష్మిక.. షాక్ ఇచ్చిన బాలీవుడ్

చూస్తుంటే రష్మిక టైం ఏం బాగున్నట్టు లేదు. బాలీవుడ్ ను ఏలేద్దామంటూ వెళ్తే అక్కడ ఏకంగా గుడ్ బై సినిమాను ఓటీటీలో రిలీజే చేసేశారు. ఆతరువాత సినిమాల పరిస్థితి ఏంటో తెలియట్లేదు. బాలీవుడ్ సాంగ్స్ సూపర్ డూపర్ అని ఈమె ఎంత హిందీ ఇండస్ట్రీని పొగిడినా యూజ్ లేకుండా పోతోంది. మరోవైపు రష్మికను రోస్టింగ్ చేసేస్తున్న ట్రోలర్స్ ఒకటే విమర్శిస్తున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు.. కాస్త బాలీవుడ్ ఛాన్స్ దొరికిందో లేదో.. శాండిల్ వుడ్, టాలీవుడ్, కోలివుడ్ ను ఆమె సెటైరికల్ గా క్రిటిసైజ్ చేసి సౌత్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు. లేటెస్ట్ గా హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి రష్మిక హీరోయిన్ గా యాక్ట్ చేయాల్సి ఉన్న సినిమా ‘స్క్రూ ఢీ’లా నుంచి ఈమెను తీసేసినట్టు లీకులు వస్తున్నాయి. రష్మిక ప్లేస్ లో స్టార్ కిడ్ షనాయా కపూర్ వస్తున్నారట. సో మరో నెపో కిడ్ షనాయాకు రెడ్ కార్పెట్ రెడీ అన్నమాట. ఇంతకీ ఈ షనాయా ఎవరుకున్నారు ఒకప్పటి హీరో సంజయ్ కపూర్, హీరోయిన్ మహీప్ కపూర్ గారాల పట్టి. సంజయ్ కపూర్ అంటే మన అనిల్ కపూర్ తమ్ముడండీ. ఇప్పుడు గుర్తొచ్చిందా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News