Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభCoolie WAR 2 Ticket Rates: కూలీ, వార్ 2 టికెట్ రేట్లు మరీ ఇంత...

Coolie WAR 2 Ticket Rates: కూలీ, వార్ 2 టికెట్ రేట్లు మరీ ఇంత దారుణమా.. హైదరాబాద్‌లో చెన్నై, ముంబైల కంటే ఎక్కువ!

Coolie WAR 2 Ticket Rates: ఫిలిం ఇండస్ట్రీలో ఏ సినిమా సక్సెస్ అవుతుంది, ఏ సినిమా అవ్వదు అనేది కచ్చితంగా ఎవరికీ తెలీదు. ఒకప్పుడు సినిమా చూడటానికి ఆడియన్స్ థియేటర్‌కు పరుగులు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కేవలం 30 రోజులు ఆగితే చాలు, సినిమా ఓటీటీలో ప్రత్యక్షమవుతోంది. దీంతో ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేశారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. చాలాచోట్ల థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి. ఒక పెద్ద హీరో సినిమా విడుదలయితే తప్ప ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చే పరిస్థితి లేదు. పెద్ద హీరోలు కూడా సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా మారింది. ఈ తరుణంలో రీ-రిలీజ్ సినిమాలు కొంతవరకు ప్లస్‌గా మారాయి. అయితే ప్రేక్షకులు థియేటర్‌కు రాకపోవడానికి టిక్కెట్ రేట్లు పెంచడం కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పాలి.

- Advertisement -

ప్రతి కొత్త సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు పెరుగుతుంటాయి. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లను పెంచుతున్నారు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లు భారీగా పెంచేశారు.

తెలంగాణలో కూలీ మరియు వార్ 2 టికెట్ రేట్స్‌….

• మల్టీప్లెక్స్:
◦ రెక్లెయినర్ – 530/-
◦ నార్మల్ – 415/-

• సింగిల్ స్క్రీన్స్:
◦ బాల్కనీ – 250/-
◦ ఫస్ట్ క్లాస్ – 175/-
◦ నార్మల్ – 100/-

డబ్బింగ్ సినిమాకి కూడా ఇంత హైక్ ఎందుకు? అని చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సినిమాను బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులు చూడకుండా ఉండటానికి ఇది ఒక మంచి ప్లాన్ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చెన్నైలో కంటే హైదరాబాద్‌లో కూలీ టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ముంబైలో కంటే వార్ 2 టికెట్ రేట్లు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నాయి.

ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, గతంలో సీనియర్ హీరో కమల్ హాసన్‌కు విక్రమ్ రూపంలో అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఇప్పుడు రజినీకాంత్‌కు ఏ రేంజ్ హిట్ ఇస్తాడు అనేది చాలామందికి ఉన్న క్యూరియాసిటీ. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్నారు కాబట్టి వార్ 2 పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలు ఉన్నప్పటికీ, అధిక టికెట్ రేట్లు థియేటర్లకు ప్రేక్షకులను దూరం చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై సినీ పరిశ్రమ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/car-controversy-clarity-given-by-actress-nidhi-agarwal/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad