Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభShriya : పబ్లిక్‌గా భర్తకి లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్.. ముద్దిస్తే తప్పేంటి??

Shriya : పబ్లిక్‌గా భర్తకి లిప్ కిస్ ఇచ్చిన హీరోయిన్.. ముద్దిస్తే తప్పేంటి??

- Advertisement -

Shriya : ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ కొంత కాలం క్రితం రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చీవ్‌ను పెళ్లి చేసుకొని సినిమాల నుంచి గ్యాప్ తీసుకుంది. వీరికి ఇప్పుడు ఒక పాప కుడా ఉంది. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన శ్రియ వరుసగా తెలుగు, హిందీలో సినిమాలు, సిరీస్ లు చేస్తుంది.

ఇటీవలే బాలీవుడ్ లో అజయ్ దేవగణ్ సరసన దృశ్యం 2 రీమేక్ లో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా స్పెషల్ షో వేయడంతో శ్రియ తన భర్తతో కలిసి వచ్చింది. మీడియాకి ఫోజులిస్తూ శ్రియ తన భర్తకి లిప్ కిస్ ఇచ్చింది. గతంలో కూడా శ్రియ తన భర్తకి ఇలా బహిరంగంగానే ముద్దు పెట్టింది. దీంతో శ్రియని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పబ్లిక్ గా లిప్ కిస్ ఇస్తావా, అది కూడా మీడియా ముందు అంటూ కొంతమంది శ్రియని విమర్శిస్తున్నారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్రియ దీనిపై స్పందిస్తూ.. ”మా ఆయనకి నేను ముద్దు పెడితే తప్పేంటి. ముద్దుని ఇంత విచిత్రంగా చూసేవాళ్ళు కూడా ఉంటారా. ఇందులో విమర్శించడానికి ఏముంది. ఒక స్పెషల్ మూమెంట్ లో నా భర్తకి నేను కిస్ ఇచ్చాను. అది తప్పా?. అయినా ఇలా ట్రోల్ చేసేవాళ్ళు ఏమైనా అనుకోండి. నా మనసుకి నచ్చింది నేను చేస్తాను” అని ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News