Wednesday, January 22, 2025
Homeచిత్ర ప్రభGunde Ninda Gudigantalu January 22st Episode: ప్రభావతి పరువు తీసిన శృతి.. అక్కడ మౌనిక...

Gunde Ninda Gudigantalu January 22st Episode: ప్రభావతి పరువు తీసిన శృతి.. అక్కడ మౌనిక పరిస్థితి ఏంటో…

ఈరోజు ఎపిసోడ్‌లో మీనా పడుకుని ఉంటే బాలు వచ్చి తనని లేపేసి నాకు నిద్ర రావట్లేదు పైకి వెళ్దాం పద మాట్లాడుకుందాం అంటాడు.పైకి వెళ్లి చుక్కలు లెక్కేసుకుంటారు. నువ్వు అనుకున్నట్టు ఏమి లేదు అక్కడ చుక్కలు చూడు వాటికి రూమ్ అవసరం లేదు అని ఏదేదో చెప్తాడు. ఆకాశంలో చూస్తూ మాట్లాడుకుంటారు. రోజంత పనులు చేసి అలసిపోయాను పడుకోనివ్వండి అని మీనా అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇంకా ఇద్దరు ఉన్నారుగా వాళ్లని చేయమను అంటాడు బాలు. నువ్వు ఫస్ట్ వచ్చిన కోడలివి నువ్వు హోదాగా ఉండాలి అని చెప్తుంటే మీనా ఏమో నిద్రపోతుంది. మరోవైపు మౌనిక తన అన్నయ్య ఇచ్చిన బంగారు గాజులను చూస్తూ మురిసిపోతూ ఉంటుంది.

- Advertisement -
Photo Credit: Disney + hotstar

ఇంతలో సంజు వచ్చి నీ చేతికి ఈ గాజులు ఎక్కడివి మీ అన్నయ్య ఇచ్చాడా అని అడుగుతాడు. అప్పుడు మౌనికా ఏడుస్తుంది. సమాధానం చెప్పమని సంజు అడుగుతుంటే మౌనిక ఏడుస్తుంది ఈలోగా సంజు వాళ్ళ అమ్మ వచ్చి ఆపుతుంది. ఆ గాజులు నేనే ఇచ్చాను అని చెప్తుంది. మృగంలా ప్రవర్తించకు అని మంజుకు చెప్పి మౌనికను అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఉదయాన్నే ప్రభావతి మీనా దగ్గరకు వచ్చి కాఫీ పెట్టావా త్వరగా పెట్టు కొత్త కోడలు లేచి ఉంటుంది అని కంగారు పెడుతుంది. రూమ్‌లో రవి శృతి చీర మడతపెడుతుంటే ప్రభావతి చూసి ఏమి చేస్తున్నావురా ఇలాంటి పనులు మీ మీనా వదినకి చెప్పు అంటుంది. తర్వాత శృతి ఎక్కడుంది అని అడిగితే శృతి వెళ్లిపోయిందిగా అంటాడు. అలా కాదమ్మా డ్యూటీకి వెళ్ంది అంటే అవునా అని అయినా ఇంట్లో పెద్దదాన్ని ఉన్నాను ఒక మాట చెప్పకుండా వెళ్ళిపోయిందా అంటుంది.

తనకు ఇలాంటివి తెలియదు అమ్మా ప్రభావతి ఏమో నానా రచ్చ చేస్తుంది. నా పరువు పోదా అంటుంది. నా మిగతా ఇద్దరు కోడలు ఉన్నారు ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా చెప్పకుండా వెళ్లరు అంటుంది. నీ భార్య వచ్చిన రోజే నాకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటుందా అంటుంది. ఈలోగా సత్యం వచ్చి ఏమైది అంటే జరిగింది చెప్తుంది. నీకు రాత్రి చెప్పాను కదా కొన్ని విషయాలు చూసి చూడనట్టుగా వదిలేయమని అంటే ప్రభావతి మాత్రం ఓ అరుస్తూ మాట వినదు. తన మాటలకు సత్యం, రవి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో రోహిణి అక్కడికి వచ్చి కాఫీ బాగుంది అని తాకబోతుంది. మీకు చెప్పకుండా వెళ్లిందా అని రోహిణి అంటే లేదు నాకు రాత్రే చెప్పింది మర్చిపోయాను అంటుంది ప్రభావతి. అప్పుడు రవి నాకు ఉదయాన్నే చెప్పింది నీకు రాత్రి ఎలా చెప్పింది అని అడుగుతుంది. అప్పుడు మీనా శృతి నాకు చెప్పే వెళ్ళింది అని మీనా చెప్తుంది. మరి కాఫీ కలిపినప్పుడు ఆ విషయం చెప్పలేదే అంటుంది మీరందరూ నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News