Saturday, June 21, 2025
Homeచిత్ర ప్రభShruti Haasan: నా ఇష్టం.. మీకెందుకు? ప్లాస్టిక్ సర్జరీపై శ్రుతి సీరియస్

Shruti Haasan: నా ఇష్టం.. మీకెందుకు? ప్లాస్టిక్ సర్జరీపై శ్రుతి సీరియస్

Actress Shruti: సౌత్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి లాగే ఏది అనిపిస్తే అదే మాట్లాడేస్తుంది. కొన్ని సందర్భాలలో నెటిజన్స్ గనక విసిగితే వారికి తగ్గట్టే బోల్డ్‌గా ఆన్సర్ ఇచ్చి పిచ్చెక్కిస్తుంది. తాజాగా కూడా ఇలాంటి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది శృతి. 1980 ల నుంచి హీరోయిన్స్ కొందరు సినిమాలలో అందంగా కనిపించడం కోసం ఫేస్ సర్జరీ చేయించుకున్నారు.

- Advertisement -

కొందరు ఫేస్ లో ముక్కు, లిప్స్ లాంటి భాగాలు సర్జరీ చేయించుకున్నారు. హీరోయిన్స్‌ మాత్రమే కాదు కొందరు హీరోలు కూడా అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకున్న వాళ్ళున్నారు. కొందరు బరువు తగ్గి, స్లిమ్మ్ గా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకుంటారు. శ్రీదేవి లాంటి అగ్ర తార కూడా దీనికి మినహాయింపేమి కాదు. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలోనూ ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్స్ ఉన్నారు.

అయితే చాలా మంది ఈ విషయాన్ని బయట చెప్పుకునేందుకు ఇష్టపడరు. పైగా మీరు మీ శరీరంలో ఏ భాగానికైనా సర్జరీ చేయించుకున్నారా..? అని అడిగితే ఇంతెత్తున ఎగురుతారు. సమాధానం చెప్పడానికి నిరాకరిస్తారు. కొందరు సున్నితంగా ఈ విషయాన్ని పక్కకి నెట్టేస్తారు. శృతి హాసన్ లాంటి వారు మాత్రం ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. సోషల్‌ మీడియాలో శృతి హాసన్‌ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వచ్చి వైరల్ అవుతూనే ఉంటుంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/rakul-preet-and-jackky-bhagnani-recognized-as-fit-india-couple/

అయితే, తాజాగా శృతి హాసన్‌ తన సర్జరీల గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. శృతికి చిన్నప్పటి నుంచి తన ముక్కు అంటే ఇష్టం ఉండేది కాదట. అందుకే ఆ ముక్కుకు సర్జరీ చేయించుకున్నట్టు తెలిపింది. నా శరీరం నా ఇష్టం, నాకు నచ్చినట్లు మార్పులు చేయించుకుంటాను..అంటూ బోల్డ్‌గా మాట్లాడింది. ఆమె మాటలు కాస్త ఎబెట్టుగా ఉన్నప్పటికీ ఆమె కోణంలో ఆలోచిస్తే నిజమేననిపిస్తుంది. ముఖం మరింత అందంగా కనిపించడం కోసం ఫిల్లర్స్ కూడా వాడినట్టు చెప్పింది శృతి.

అంతే కాదు భవిష్యత్తులో ముసలితనం వల్ల వచ్చే ముడతలు పోగొట్టుకునేందుకు కూడా ఫేస్ లిఫ్ట్ చేయించుకుంటానేమో అంటూ ముందుగానే క్లారిటీ ఇచ్చింది. ఇలా ప్లాస్టిక్ సర్జరీల గురించి, అందానికి సంబంధించిన సర్జరీ గురించి హీరోయిన్స్ మాట్లాడటం తక్కువనే చెప్పాలి. కానీ, నెటిజన్స్‌తో ముచ్చటించినప్పుడు మాత్రం ఈ విషయాలను ఓపెన్ గా చెప్పేసింది శృతి హాసన్. ఇక ఆమె ప్రస్తుతం కూలీ సినిమాలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News