Shruti Haasan: కోలీవుడ్ బ్యూటీ శ్రుతీ హాసన్ కథానాయికే కాదు.. సంగీత దర్శకురాలు.. సింగర్ అనే విషయం తెలిసిందే. హీరోలతో ఆడిపాడటమే కాదండోయ్, కుదిరితే వారి కోసం పాటలను కూడా పాడేస్తుంటుంది. పలు సందర్భాల్లో ఈ విషయం ప్రూవ్ అయ్యింది. తాజాగా మరోసారి ఈ చెన్నై సుందరి సూపర్‌స్టార్ మహేష్ కోసం తన గొంతును సవరించుకుంది. వివరాల్లోకెళ్తే.. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ కథానాయకుడిగా SSMB 29 సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నవంబర్ 15న ఈ చిత్రానికి సంబంధించి తొలి అధికారిక ప్రకటన రానుంది. దీని కోసం భారీ వేడుకను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో SSMB 29కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని శ్రుతీ హాసన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అదేంటంటే.. ఈ చిత్రంలో ‘సంచారి సంచారి..’ అంటూ సాగే పాటను ఆమె పాడింది. కీరవాణి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమాలో పాటను శ్రుతీ హాసన్, కాల భైరవ పాడారు. చైతన్య పాటను రాశారు. హీరో వ్యక్తిత్వాన్ని తెలియజేసే సాంగ్ ఇది. ఇప్పటికే మహేష్‌కు జతగా శ్రీమంతుడు సినిమాలో శ్రుతి నటించింది. తర్వాత ఆగడు సినిమాలో ఐటెం సాంగ్‌లో ఆడిపాడింది. ఇప్పుడు సింగర్‌గా మారింది.
ప్రపంచాన్ని చుట్టే సాహిసికుడైన గ్లోబల్ ట్రాటర్‌గా మహేష్ ఇందులో కనిపించబోతున్నారు. ఇప్పటికే ప్రతినాయకుడుగా నటిస్తోన్న పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రకు సంబంధించిన లుక్‌ను రీసెంట్‌గా మేకర్స్ విడుదల చేశారు. కుంభ అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. మంగళవారం కథానాయిక ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన లుక్‌ను విడుదల చేస్తున్నారు. నవంబర్ 15న మహేష్ లుక్‌తో పాటు సినిమా టైటిల్‌ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది.
నవంబర్ 15న జరగనున్న SSMB 29 ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు లక్ష మంది వేడుకకు హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా స్పెషల్ డాన్స్ నెంబర్ కూడా ఈవెంట్‌లో ఉంటుందని, ఒక్కో పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తారని చివరగా మహేష్ ఏంట్రీ తర్వాత, ఆయన లుక్ రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. మూడు నిమిషాల వీడియోను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అదెలా ఉండబోతోందననే ఆసక్తి అందరిలోనూ క్రియేట్ అయ్యింది. రామాయణం స్ఫూర్తితో రాజమౌళి ఈ సినిమా కథను రాసుకున్నారని.. సినిమాలోనూ రామాయణం టచ్ ఇవ్వబోతున్నారనే న్యూస్ కూడా వైరల్ అవుతోంది.
Also Read- Ruhani Sharma: బంపరాఫర్ కొట్టేసిన చిలసౌ హీరోయిన్ – తెలుగు సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా


