Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSiddu Jonnalagadda: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్ - స్టార్ బాయ్‌ జాగ్ర‌త్త ప‌డే...

Siddu Jonnalagadda: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ఖాతాలో మ‌రో డిజాస్ట‌ర్ – స్టార్ బాయ్‌ జాగ్ర‌త్త ప‌డే టైమొచ్చింది!

Siddu Jonnalagadda: డీజే టిల్లు బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ టైర్ 2 హీరోల‌ లిస్ట్‌లోకి చేరిపోయాడు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా వ‌చ్చిన టిల్లు స్క్వేర్ ఏకంగా 130 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ రెండు విజ‌యాల‌తో టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరో ఇమేజ్ సిద్ధుకు వ‌చ్చింది. అత‌డితో సినిమాలు చేసేందుకు గీతా ఆర్ట్స్‌, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌లు ముందుకొచ్చాయి. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మ‌రో ర‌వితేజ అంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఈ స్టార్ బాయ్‌ను ఆకాశానికి ఎత్తారు. ఈ జోష్‌లోనే బ్యాక్ టూ బ్యాక్ కొత్త సినిమాలు మొద‌లుపెట్టాడు సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌.

- Advertisement -

కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైమ్‌లో జాక్‌తో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు గ‌ట్టి స్ట్రోక్ త‌గిలింది. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ స్పై యాక్ష‌న్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఈ డిజాస్ట‌ర్ ఎఫెక్ట్ నుంచి తెలుసు క‌దాతో బ‌య‌ట‌ప‌డాల‌ని సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ అనుకున్నారు. టిల్లు ఇమేజ్ నుంచి నుంచి కూడా త‌న‌ను దూరం చేసే మూవీ అవుతుంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ అత‌డు ఒక‌టి ఊహిస్తే రిజ‌ల్ట్ మాత్రం మ‌రోలా వ‌చ్చింది. జాక్‌కు మించి డిజాస్ట‌ర్‌గా తెలుసు క‌దా నిలిచింది.

Also Read- Sandeep Reddy Vanga: ర‌ష్మిక మంద‌న్న‌ గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాను రిజెక్ట్ చేసిన సందీప్ వంగా – ట్విస్ట్ ఏంటంటే?

నీర‌జ కోన ద‌ర్శ‌క‌త్వంలో స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో రూపొందిన తెలుసు క‌దా మూవీ దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రిలీజ్‌కు ముందు పండుగ సినిమాల్లో తెలుసు క‌దాపైనే ఎక్కువ‌గా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ రిలీజ్ త‌ర్వాత సీన్ మొత్తం రివ‌ర్స్ అయ్యింది. డ్యూడ్‌, కే ర్యాంప్ పోటీని త‌ట్టుకొని బాక్సాఫీస్ వ‌ద్ద సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మూవీ నిల‌బ‌డ‌లేక‌పోయింది.

దాదాపు 45 కోట్ల బ‌డ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ తెలుసు క‌దా సినిమాను నిర్మించారు. 12 రోజుల్లో కేవ‌లం ప‌ది కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే తెలుసు క‌దా రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 30 శాతం మేర రిక‌వ‌రీ సాధించింద‌ట‌. సెకండ్ వీక్‌లో అయినా వ‌సూళ్లు పెరుగుతాయ‌ని మేక‌ర్స్ ఇటీవ‌ల థాంక్స్ మీట్ నిర్వ‌హించారు. ఆ ప్ర‌మోష‌న్స్ కూడా క‌లిసిరాలేదు. రెండో వారం అతి క‌ష్టంగా 66 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. మ‌రో మూడు రోజుల్లో బాహుబ‌లి రీ రిలీజ్‌తో పాటు ర‌వితేజ మాస్ జాత‌ర థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. అప్ప‌టిలోగా తెలుసు క‌దా సెకండ్ వీక్ లో కోటి మార్కును అయినా ట‌చ్ చేస్తుందా లేదా అన్న‌ది అనుమానంగా మారింది.

ఓవ‌రాల్‌గా జాక్‌కు మించి సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా తెలుసు క‌దా మూవీ నిల‌వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. క‌థ‌ల విష‌యంలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ జాగ్ర‌త్త‌ప‌డే టైమ్ వ‌చ్చింద‌ని అంటున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చేయాల్సిన పాన్ ఇండియ‌న్ మూవీ కోహినూర్ కూడా ఆగిపోయింద‌ట‌. ఇప్పుడు సిద్ధు ఆశ‌ల‌న్నీ బ్యాడాస్ పైనే ఉన్నాయి.

Also Read- KCR: బావతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్‌.. మరికాసేపట్లో హరీశ్‌రావు ఇంటికి మాజీ సీఎం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad