Telusu Kada: సినిమా ఇండస్ట్రీలో హీరోగా వచ్చి ఒక సపరేట్ క్రేజ్ సంపాదించుకోవడం చాలా కష్టం. ఇండస్ట్రీలో నట వారసులను తట్టుకొని నిలబడాలంటే టాలెంట్‌తో పాటు లక్ కలిసి వచ్చి హిట్స్ దక్కించుకోవాలి. మరీ ముఖ్యంగా హీరో మెటీరియల్ అనిపించుకోవడంతో పాటుగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకోవాలి. మ్యానరిజం, ఓ యాటిట్యూడ్ లాంటివి హీరోగా ఓ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయి. అదే సిద్ధు సంపాదించుకున్నాడు. గుంటూరు టాకీస్ సినిమాలో తన పర్ఫార్మెన్స్ మాస్ ఆడియన్స్‌తో పాటు యూత్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. దాంతో సిద్దు బాగా నోటెడ్ అయ్యాడు.
గుంటూరు టాకీస్ సినిమా ఒక మాదిరిగా సక్సెస్ సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ సాధించింది. ఈ సినిమా యూత్ ఆడియన్స్‌కి తెగ ఎక్కేసింది. ఇందులో సిద్దు యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ, పర్ఫార్మెన్స్ లాంటివి ప్రతీ ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ సీన్స్ ఉన్నా కూడా కథ, కథనాలలో మంచి ఎమోషన్స్ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ని డీజే టిల్లు థియేటర్స్‌కి రప్పించింది. టిల్లు పాత్రలో మాస్ ఎలివేషన్స్ సిద్దుకి ఓ బ్రాండ్ తెచ్చిపెట్టాయి. ఈ మూవీలో డైలాగ్స్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.
Also Read- Sharwanand: పెళ్లైన రెండేళ్లకే విభేదాలు – విడాకుల బాటలో టాలీవుడ్ హీరో శర్వానంద్?
డీజే టిల్లు సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ వచ్చింది. ఈ సినిమా కూడా సిద్దుకి మంచి హిట్ ఇచ్చింది. సాధారణంగా మీడియం బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు సీక్వెల్‌గా రూపొందితే అంతగా సక్సెస్ సాధించిన దాఖలాలు చాలా తక్కువ. కానీ, ఈ మాటను టిల్లు స్క్వేర్ ఓవర్ కమ్ చేసింది. డీజే టిల్లు ఎలాంటి కమర్షియల్ సక్సెస్‌ని సాధించిందో.. ఆ తర్వాత వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా అంతే కమర్షియల్ సక్సెస్‌ని సాధించింది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్‌లో సిద్ధు జొన్నలగడ్డకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడున్న యూత్ హీరోలలో సిద్ధుకి మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. ఇక ఈ సినిమాల తర్వాత జాక్ సినిమాతో వచ్చిన సిద్ధుకి బాక్సాఫీస్ వద్ద ఊహించని షాక్ తగిలింది. బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య హీరోయిన్ అనగానే అందరూ ఎంతో ఊహించుకున్నారు. కానీ, ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.
ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా తెలుసు కదా అనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీ రూపొందుతోంది. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా సిద్ధుకి జంటగా నటిస్తున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన గ్లింప్స్, సాంగ్స్, టీజర్ మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. లవ్ అండ్ కామెడీ జానర్‌లో దర్శకురాలు తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంచి అంచనాలు కూడా తెలుసు కదా మూవీపై ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మరి, తెలుసు కదా మూవీతో మళ్ళీ సిద్ధు హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.
Also Read- Nag Ashwin: కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. నాగ్ అశ్విన్ పోస్ట్ దీపికా పదుకొనెను ఉద్దేశించేనా?


