Telusu Kada OTT: సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తెలుసు కదా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీతో స్టైలిష్ట్ నీరజ కోన డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్లలో రిలీజైన తెలుసు కదా డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
దీపావళికి డ్యూడ్, కే ర్యాంప్, మిత్రమండలి సినిమాలకు పోటీగా తెలుసు కదా థియేటర్లలోకి వచ్చింది. సిద్ధు జొన్నలగడ్డకు యూత్‌లో ఉన్న క్రేజ్‌తోపాటు ఇద్దరు హీరోయిన్లు నటించడంతో తెలుసు కదా తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సరోగసీ కాన్సెప్ట్‌తో డైరెక్టర్ నీరజ కోన మూవీని రూపొందించారు. కాన్సెప్ట్ కొత్తగానే ఉన్నా స్క్రీన్‌పై ఆవిష్కరించిన విధానంలో ఆసక్తి లోపించడంతో తెలుసు కదా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
Also Read- Buchi Babu Sana: కొత్తింట్లోకి అడుగుపెట్టిన పెద్ది డైరెక్టర్ – పిఠాపురంలో గృహప్రవేశం
దాదాపు నలభై ఐదు కోట్ల బడ్జెట్‌తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. థియేటర్ల 11 కోట్లలోపే వసూళ్లను రాబట్టింది. ఇరవై శాతం వరకు మాత్రమే రికవరీ సాధించిన ఈ మూవీ నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. జాక్ తర్వాత తెలుసు కదాతో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో పడింది. తెలుసు కదా మూవీకి తమన్ మ్యూజిక్ అందించాడు. తెలుసు కదా మూవీని నితిన్ చేయాల్సింది. కానీ కథ తనకు సెట్టవ్వదనే ఆలోచనతో రిజెక్ట్ చేయడంతో సిద్ధు జొన్నలగడ్డకు ఆఫర్ దక్కింది.
వరుణ్ (సిద్ధు జొన్నలగడ్డ), అంజలి (రాశీఖన్నా) పెళ్లిచేసుకుంటారు. పిల్లల విషయంలో వారికి సమస్య ఎదురువుతుంది. అదే టైమ్‌లో వరుణ్ మాజీ లవర్ రాగ (శ్రీనిధి శెట్టి) వారి లైఫ్‌లోకి ఎంటరవుతుంది. కాలేజీ రోజుల్లో రాగను ప్రాణంగా ప్రేమించిన వరుణ్ ఆమెకు ఎందుకు దూరమయ్యాడు? వరుణ్, అంజలి సమస్యను రాగ ఎలా సాల్వ్ చేసింది? అనే పాయింట్‌తో తెలుసు కదా మూవీ రూపొందింది. తెలుసు కదా తర్వాత ప్రస్తుతం బ్యాడాస్‌తో పాటు టిల్లు క్యూబ్ సినిమాలు చేస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.
Also Read- Jubilee Hills: నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. అంతుచిక్కని ప్రజానాడి!


