Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSiddu Jonnalagadda: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మూవీకి జాక్‌పాట్ - రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్‌

Siddu Jonnalagadda: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ మూవీకి జాక్‌పాట్ – రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ క్లోజ్‌

Siddu Jonnalagadda: సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ తెలుసు క‌దా మూవీకి జాక్‌పాట్ త‌గిలింది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ‌య్యింది. రొమాంటిక్ కామెడీ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతో కోన వెంక‌ట్ సిస్ట‌ర్‌, స్టైలిష్ట్ నీర‌జ కోన డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుసు క‌దా మూవీలో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు జోడీగా రాశీఖ‌న్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

- Advertisement -

అక్టోబ‌ర్‌లో రిలీజ్‌…
అక్టోబ‌ర్ 17న తెలుసు క‌దా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతుంది. కాగా రిలీజ్‌కు ముందే ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్ అమ్ముడు పోయిన‌ట్లు స‌మాచారం. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను 22 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఓటీటీ హ‌క్కుల ద్వారానే పెట్టిన బ‌డ్జెట్‌లో దాదాపు స‌గం వ‌ర‌కు మేక‌ర్స్ రిక‌వ‌రీ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

గుడ్‌టైమ్ స్టార్ట్‌…
తెలుసు క‌దా మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే మిరాయ్‌తో పెద్ద హిట్‌ను అందుకున్నారు విశ్వ‌ప్ర‌సాద్‌. ఇప్పుడు తెలుసు క‌దా ఓటీటీ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డంతో విశ్వ‌ప్ర‌సాద్ గుడ్‌టైమ్ స్టార్ల‌యిన‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Also Read – Supreme Court: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే ఆస్తి హక్కు రద్దు.. సుప్రీం సంచలన తీర్పు

టీజ‌ర్ రిలీజ్‌…
తెలుసు క‌దా మూవీ టీజ‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు. ఇందులో ఇద్ద‌రు అమ్మాయిలో ప్రేమ‌లో ప‌డిన యువ‌కుడిగా సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ క‌నిపించారు. కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఈ టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు పాట‌లు కూడా హిట్ట‌య్యాయి. తెలుసు క‌దా మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు.

నాని హిట్ 3…
కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి తెలుగులో అంగీక‌రించిన ఫ‌స్ట్ మూవీ తెలుసు క‌దా. కానీ ముందుగా నాని హిట్ 3 రిలీజైంది. తెలుగులో అత్తారింటికి దారేది, ర‌భ‌స‌, బాద్‌షా, నిన్నుకోరితో పాటు యాభై వ‌ర‌కు సినిమాల‌కు క్యాస్టూమ్ డిజైన‌ర్‌గా ప‌నిచేసింది నీర‌జ కోన‌. తెలుసు క‌దా మూవీతో ఫ‌స్ట్ టైమ్ మెగాఫోన్ ప‌ట్టింది.

జాక్‌తో డిజాస్ట‌ర్‌…
తెలుసు క‌దా కంటే ముందు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ జాక్ సినిమా చేశారు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ స్పై యాక్ష‌న్ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. దాంతో తెలుసు క‌దా స‌క్సెస్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌కు కీల‌కంగా మారింది.

Also Read – OnePlus 13R Discount: వన్ ప్లస్ 13R పై ఏకంగా రూ.7,250 డిస్కౌంట్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad