Press Meets: సినిమా ప్రెస్ మీట్ ముసుగులో వ్యక్తిగత దాడి… పడిపోతున్న విలువలు!
ఈ మధ్యకాలంలో సినిమా ప్రెస్ మీట్‌లు కేవలం సినిమాల గురించి చర్చించడానికి వేదికలు కావడం లేదు. కొన్ని అభ్యంతరకరమైన, వ్యక్తిగత విమర్శలకు తావిచ్చే ప్రశ్నల కారణంగా తరచూ వివాదాలకు వేదికగా మారుతున్నాయి. ఇటీవల స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఎదురైన అనుభవం, అంతకుముందు ప్రదీప్ రంగనాథన్ విషయంలో జరిగిన సంఘటనలు… ప్రజల నుండి “రోజు రోజుకి జర్నలిజం ఎలా దిగజారుతుంది చూస్తున్నారా?” అనే విమర్శలు రావడానికి ఇవే ప్రధాన కారణాలు.
మైక్ ఉంది కదా అని…
సిద్ధు జోన్నలగడ్డ తాజా చిత్రం ప్రెస్ మీట్‌లో ఒక మహిళా రిపోర్టర్ “మీరు రియల్ లైఫ్‌లో ఉమెనైజరా?” అని అడగడం సంచలనం సృష్టించింది. సినిమాలో పాత్ర స్వభావాన్ని ప్రస్తావిస్తూ ఈ ప్రశ్న అడిగినా, ‘ఉమనైజర్’ వంటి తీవ్రమైన వ్యక్తిగత పదాన్ని ఉపయోగించడంపై ఆ మహిళా రిపోర్టర్ పై సోషల్ మీడియా లో చాల విమర్శలు ఎదురవుతున్నాయి.
ఈ ప్రశ్న విన్న సిద్ధు షాక్‌కి గురయ్యాడు . “ఇది పర్సనల్ ఇంటర్వ్యూనా? ప్రెస్ మీటా? నాకు ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు,” అంటూ అసహనం వ్యక్తం చేశాడు. “చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం సరికాదు,” అంటూ సిద్దు చేసిన వ్యాఖ్యలు … ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/rashmika-mandanna-3000-crore-box-office-record/
అంతకుముందు ప్రదీప్ రంగనాథన్.
ఇదే తరహాలో అంతకుముందు నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్‌కు కూడా అవమానకరమైన ప్రశ్న ఎదురైంది. “మీరు లుక్ పరంగా హీరో మెటీరియల్ కాదు, కానీ రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిదంటే అది మీ హార్డ్ వర్కా లేక అదృష్టమా?” అంటూ అదే మహిళా రిపోర్టర్ ప్రశ్నించారు. ఇది సినిమా విజయం గురించి చర్చించడానికి బదులు, నటుడిని వ్యక్తిగతంగా కించపరిచేలా ఉంది అని వ్యక్తమయ్యాయి .
సమస్య ఎక్కడ ఉంది?
జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం. నిజాన్ని నిర్భయంగా చెప్పే వృత్తి ధర్మాన్ని పాటించడం ప్రతి జర్నలిస్టు బాధ్యత. అయితే, సినిమా ప్రెస్ మీట్‌ల విషయంలో ‘మనం అడిగిందే ప్రశ్న’ అన్న భ్రమలో కొందరు వ్యవహరించడం సరైనది కాదు అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


