స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, నీరజా కోన, టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘తెలుసు కదా’ లవ్లీ వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
న్యూ జెన్ లవ్ స్టోరీగా
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం న్యూ జనరేషన్ లవ్ స్టొరీ ‘తెలుసు కదా’లో నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్, కోన వెంకట్ కుమార్తె నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా, మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. రాశి ఖన్నా సిద్ధు బుగ్గపై ముద్దు పెడుతూ చిరునవ్వులో కనిపిస్తుండగా, శ్రీనిధి శెట్టి అతని ముందు నిలబడి ఉండటం ఒక పర్ఫెక్ట్ వాలెంటైన్స్ డే పోస్టర్ ని ప్రజెంట్ చేస్తోంది.