Re Edit: ‘సికిందర్’ అంటే గుర్తుకొచ్చేది సూర్య ఊర మాస్ లుక్, స్టైల్. ముఖ్యంగా ‘రాజు భాయ్’ పాత్రలో ఆయన గెటప్ యూత్‌ను ఒక ఊపు ఊపింది. కానీ కథనం నెమ్మదిగా ఉందనే విమర్శ ఆ రోజుల్లో వినిపించింది. అందుకే, దర్శకుడు ఎన్. లింగుస్వామి ఈసారి ఎడిటింగ్‌ను మరింత పదును పెట్టారు. అనవసరమైన సాగతీత లేకుండా, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌కు ఇంకాస్త ఎక్కువ స్కోప్ ఇచ్చి, సినిమాను పూర్తిగా కొత్త ఎంగేజింగ్ లెవెల్‌కి తీసుకెళ్తున్నారట. గ్యాంగ్‌స్టర్ డ్రామాను హైలైట్ చేస్తూ, యాక్షన్ సీక్వెన్స్‌ల ఇంటెన్సిటీని పెంచేలా ఈ రీ-ఎడిట్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/siddu-jonnalagadda-womanizer-question-journalism-values/
యువన్ మ్యూజిక్ మ్యాజిక్ మళ్లీ!
ఈ సినిమాకు సంగీతం అందించింది మన టాలీవుడ్‌కు కూడా ఎంతో దగ్గరైన యువన్ శంకర్ రాజా. ‘ఎక్ దో తీన్’ పాటను స్వయంగా సూర్య పాడటం అప్పట్లో సెన్సేషన్. అలాగే, ‘బ్యాంగ్ బ్యాంగ్’ వంటి పాటలు యూత్ లవర్‌బాయ్స్‌కి ఫేవరెట్‌గా మారాయి. ఇప్పుడు, కొత్త ఎడిటింగ్‌తో ఈ పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయే పాటలు థియేటర్లో వింటే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ ఖాయం!
లింగుస్వామి ‘రిడెంప్షన్’
గతంలో వచ్చిన నెగటివ్ ఫీడ్‌బ్యాక్ కారణంగా, హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను వేరే విధంగా ఎడిట్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే దానికి అద్భుతమైన స్పందన వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు లింగుస్వామి వెల్లడించారు. అందుకే, ఈసారి తానే స్వయంగా ఎడిటింగ్ పనులు పర్యవేక్షించి, సినిమాకు ‘రెండో అవకాశం’ ఇవ్వాలనుకుంటున్నారు. ఫ్యాన్స్ దీన్ని “రిడెంప్షన్ రిలీజ్” గా పిలుచుకుంటున్నారు.
సూర్య అభిమానులకు పండుగ
రీసెంట్‌గా చాలా పెద్ద సినిమాలకు మళ్లీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో, సూర్య కెరీర్‌లో స్టైలిష్‌గా నిలిచే ‘సికిందర్’ పాత తరం ప్రేక్షకులకు నాస్టాల్జియాను, కొత్త తరం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం పక్కా! నవంబర్ 28న తమిళ్ వెర్షన్ (అంజాన్) రీ-రిలీజ్ అవుతున్నట్లు ఒక ప్రకటన వెలువడింది. తెలుగులో కూడా అఫీషియల్ రిలీజ్ డేట్ అతి త్వరలోనే రానుంది!


