Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSimbu: శింబు ‘సామ్రాజ్యం’ తారక్ సపోర్ట్.. ప్రోమో డేట్, టైమ్ ఫిక్స్

Simbu: శింబు ‘సామ్రాజ్యం’ తారక్ సపోర్ట్.. ప్రోమో డేట్, టైమ్ ఫిక్స్

Simbu: డైరెక్టర్ వెట్రి మారన్ సినిమాలకు ఓ స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. రా అండ్ ర‌స్టిక్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌టంలో ఆయ‌నకొక ప్ర‌త్యేక‌మైన శైలి ఉంది. మంచి సక్సెస్ రేటుతో సినిమాలు చేస్తోన్న ఈ డైరెక్ట‌ర్‌కు ఇప్పుడు మాస్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న సిలంబ‌ర‌స‌న్ అలియాస్‌ శింబు తోడైయ్యాడు. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమా ‘అరసన్’. ప్రముఖ నిర్మాత కలైపులి థాను దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను త‌మిళంతో పాటు తెలుగులోనూ ఏక కాలంలో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

తాజాగా మేక‌ర్స్ తెలుగులో అర‌స‌న్ సినిమా టైటిల్‌ను ‘సామ్రాజ్యం’ అని ఖ‌రారు చేసిన‌ట్లు రివీల్ చేశారు. అంతే కాకుండా ఈ సినిమా తెలుగు ప్రోమోను శుక్ర‌వారం ఉద‌యం టాలీవుడ్ స్టార్ హీరో తార‌క్ చేతుల మీదుగా విడుద‌ల చేస్తున్నారు. ఇది నార్త్ చెన్నై బేస్ చేసుకుని సాగే గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా రూపొందుతోంది. కోలీవుడ్ నుంచి తెలుగుకు వస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో శింబు తిరిగి తెలుగు ఆడియెన్స్ మనసులను గెలుచుకుంటాడా అన్నది చూడాలి. కానీ ఇప్పటి వరకు లుక్, బజ్‌, కాంబినేషన్లు చూస్తే ఈసారి మిస్స్ అవ్వకుండా హిట్ కొట్టే ఛాన్స్ ఎక్కువగానే ఉంది.

Also Read – Srinu Vaitla: ఎట్ట‌కేల‌కు శ్రీనువైట్ల‌కు హీరో దొరికేశాడుగా – పుష్ప ప్రొడ్యూస‌ర్ల‌తో నెక్స్ట్ మూవీ!

తమిళ స్టార్ హీరో శింబు మళ్లీ తెలుగు సినిమా పరిశ్రమపై దృష్టి పెట్టినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల తన ఫిజిక్‌ను మార్చుకొని వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌ను ట్రాక్ ఎక్కిస్తున్నాడు శింబు. ఇప్పుడు తెలుగులో స్ట్ర‌యిట్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఎప్ప‌టి నుంచో శింబు తెలుగులో ఓ స్ట్రైట్ మూవీ చేయాలని కూడా సీరియస్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), ధనుష్ (సార్), సూర్యలతో సినిమాలు చేస్తూ సౌత్ ఇండియాలో మంచి క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్స్‌కు గేట్ వే అయ్యింది. అదే సంస్థ శింబుతో ఓ తెలుగు స్ట్రైట్ మూవీ ప్లాన్ చేస్తుండడం విశేషం.

Also Read – Mithra Mandali Review: ‘మిత్ర మండలి’ సినిమా రివ్యూ అండ్ రేటింగ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad