Simbu: తమిళం, మలయాళంతో పాటు కన్నడ హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ బాట పడుతున్నారు. మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు. కోలీవుడ్ హీరో సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా హనుమాన్ సీక్వెల్‌లో హీరోగా నటిస్తున్నాడు.
శింబు తెలుగు సినిమా…
తాజాగా మరో కోలీవుడ్ హీరో శింబు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శింబు డెబ్యూ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ దీపక్ దర్శకత్వం వహించనున్నాడట. దీపక్ గతంలో మనసానమః అనే షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ స్క్రీనింగ్‌కు ఎంపికైంది. 513కు పైగా అవార్డులు దక్కించుకొని గిన్నిస్ బుక్ రికార్డ్‌లో చోటు దక్కించుకున్నది. శింబు మూవీతో దీపక్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు చెబుతున్నారు.
Also Read – Peddi: రామ్‌చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ – దీపావళికి పెద్ది సింగిల్ లేనట్లే!
త్వరలో అనౌన్స్‌మెంట్…
శింబు ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఓ డిఫరెంట్ స్టోరీని డైరెక్టర్ దీపక్ రెడీ చేసినట్లు సమాచారం. తెలుగులో ఈ సినిమాను నిర్మించి తమిళ, మలయాళంతో పాటు ఇతర భాషల్లోకి డబ్ చేయనున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే శింబు, దీపక్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట. ఈ ఏడాది మణిరత్నం థగ్‌లైఫ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శింబు. కమల్‌హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. థగ్‌లైఫ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం నాలుగు సినిమాలు అంగీకరించాడు. శింబు హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో అరసన్ మూవీని ఇటీవల అఫీషియల్ అనౌన్స్‌చేశారు. ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీలో సమంత హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరోగానే కాకుండా సింగర్, లిరిసిస్ట్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కూడా టాలెంట్‌ను చాటుకుంటున్నాడు శింబు. పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో ఫైర్ స్ట్రోమ్ పాటను శింబునే పాడాడు. ఈ సాంగ్ పెద్ద హిట్టయ్యింది.
Also Read – Puri Jagannadh Charmme Relation : పూరీ క్లారిటీ ఇచ్చేశారు.. ఛార్మీతో నా రిలేషన్ ఇదే!


