Chinmayi Sripada: తెలుగు, తమిళ భాషల్లో టాప్ సింగర్‌గా కొనసాగుతోంది చిన్మయి శ్రీపాద. ఆమె పాడిన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాయి. సింగర్‌గానే కాకుండా సమంత, త్రిష వంటి అగ్ర హీరోయిన్లకు తెలుగులో తన గొంతును అరువిచ్చింది. పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పింది. కెరీర్‌పై ఫోకస్ పెడుతూనే ఇండస్ట్రీలో సమస్యలు ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, వేధింపులపై సోషల్ మీడియా వేదికగా తన గళం వినిపిస్తుంటుంది చిన్మయి. మీటూ ఉద్యమ సమయంలో చిన్మయి చేసిన ట్వీట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. వైరముత్తు, కార్తీక్ వంటి టాప్ సెలిబ్రిటీలపై చిన్మయి ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల కారణంగా ఆమెకు చాలా రోజులు అవకాశాలు రాలేదు. అయినా చిన్మయి మాత్రం వెనక్కి తగ్గలేదు.
తాజాగా జానీ మాస్టర్‌ను టార్గెట్ చేస్తూ చిన్మయి చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. “సింగర్ కార్తీక్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లాంటి వారిని మళ్లీ ఇండస్ట్రీలోకి తీసుకొని ఎలా అవకాశాలు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారికి అవకాశాలు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులను ప్రోత్సహించినట్లే అవుతుంది. కర్మ సిద్ధాంతం అన్నది నిజమైతే అది వారిని ఎప్పటికీ వదిలిపెట్టదు” అంటూ చిన్మయి ట్వీట్ చేసింది. చిన్మయి ట్వీట్ వైరల్ అవుతోంది. చిన్మయికి పలువురు నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు. ఆమె కామెంట్స్‌లో నిజం ఉందని అంటున్నారు. మరికొందరు మాత్రం జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణలు ఇంకా రుజువు కాలేదని కామెంట్స్ పెడుతున్నాడు.
Also Read – Ravi Teja: ‘మాస్ జాతర’ 2 రోజుల కలెక్షన్.. రికవరీ 40 శాతం లోపే!
అసిస్టెంట్ డ్యాన్స్‌మాస్టర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జానీ మాస్టర్‌పై కేసు నమోదు అయ్యింది. కొద్ది రోజులు జైలుకు వెళ్లాడు. ఈ ఆరోపణల కారణంగా జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది. మళ్లీ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ బిజీ అవుతున్నాడు. పెద్దితో పాటు పలువురు స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు.
సింగర్ కార్తీక్ బాధితులు కూడా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని అప్పట్లో చిన్మయి ఆరోపణలు చేసింది. తన స్టేటస్, పవర్‌ను ఉపయోగించి వేధింపులకు పాల్పడ్డాడని అన్నది. అప్పట్లో తనకు కార్తీక్‌కు మధ్య సింగర్ మనో రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారని చిన్మయి అన్నది.
Also Read – Anupama Parameswaran: ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది..


