Chinmayi: గత కొంతకాలంగా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది చిన్మయి శ్రీపాద. ఇటీవల గర్ల్‌ఫ్రెండ్ మూవీ ప్రమోషన్స్‌లో మంగళసూత్రం ధరించమని చిన్మయిని తాను బలవంతపెట్టనని ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్‌కు సంబంధించి రాహుల్ కంటే చిన్మయినే నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్, అసభ్య కామెంట్స్‌పై హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు కంప్లైంట్ ఇచ్చింది. తాజాగా శనివారం చిన్మయి వోట్ చోరీ గురించి చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్మయి ట్వీట్‌ను కొందరు సమర్థిస్తుండగా.. చాలా మంది ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
వీధి కుక్కలను జన సంచార ప్రాంతాల నుంచి షెల్టర్ హోమ్‌లకు తరలించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ సుప్రీ తీర్పును ఉద్దేశిస్తూ చిన్మయి సెటైరికల్‌గా ట్వీట్ చేసింది. వోట్ చోరీ గురించి మాట్లాడినప్పుడల్లా వీధి కుక్కల సమస్య తెరపైకి వస్తుంది అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నది. ఈ ట్వీట్‌తో తాను కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు అని చిన్మయి ఒప్పుకుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అతడి కామెంట్‌కు రిప్లై ఇచ్చింది చిన్మయి. తాను ఏ పార్టీకి చెందిన దానికి కాదని అన్నది.
Also Read – CM Revanth Reddy: ‘కేసీఆర్ కొడుకు జీవితంలో ఆ రేఖ లేదు.. కాంగ్రెస్ పాలన సంక్షేమానికి చిహ్నం’
మీ కెరీర్ ఎవరో నాశనం చేశారు అందుకే ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని మరో నెటిజన్ పేర్కొనగా… తన కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుందని, ఈ ఏడాది మంచి విజయాలు అందుకున్నానని చిన్మయి బదులిచ్చింది. బీజీపీ పార్టీకి వ్యతిరేకంగానే చిన్మయి ఈ ట్వీట్ చేసిందని చాలా మంది నెటిజన్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వోట్ చోరీ వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దొంగ ఓట్లతోనే మధ్యప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలను చాలా మంది సమర్థిస్తున్నారు. వారిలో ఇప్పుడు చిన్మయి కూడా చేరిందని నెటిజన్లు పేర్కొంటున్నారు.
బీజేపీ పార్టీపై చిన్మయి ఇన్‌డైరెక్ట్‌గా ఆరోపణలు చేయడం ఇది కొత్తేమీ కాదు. బీజీపీ లీడర్, తమిళ నటుడు రాధారవి మహిళలపై వేధింపులను పాల్పడినట్లు పలుమార్లు చిన్మయి ట్వీట్ చేసింది. ఈ ఆరోపణల కారణంగా చిన్మయిని తమిళ డబ్బింగ్ అసోసియేషన్ బ్యాన్ చేసింది. అప్పటి నుంచే చిన్మయి బీజేపీ పార్టీపై ఇన్‌డైరెక్ట్‌గా ఫైర్ అవుతూ వస్తోంది.
Also Read – SS Rajamouli: శంకర్, హిరానీ తర్వాత ఇప్పుడు రాజమౌళి టర్న్!


