Tuesday, April 22, 2025
Homeచిత్ర ప్రభSinger Kalpana : కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం ఏంటి..? వెలుగులోకి సంచలన నిజాలు..!

Singer Kalpana : కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం ఏంటి..? వెలుగులోకి సంచలన నిజాలు..!

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో ఎన్నో పాటలు పాడిన ఈ ఫేమస్ సింగర్ ప్రస్తుతం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు వైద్యులు స్టమక్ వాష్ చేయడంతో.. స్పృహలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఎంతో టాలెంట్ సింగరైన కల్పన ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న సమయంలో ఆమె భర్త చెన్నైలో ఉన్నారు. విషయం తెలియగానే హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో.. కల్పన అపార్ట్‌మెంట్ వాసులతో పాటు భర్తను, సెక్యూరిటీని విచారిస్తున్నారు. ఆమె ఫోన్ కాల్ డేటా, వాట్సాప్ స్టేటస్ చెక్ చేస్తున్నారు. గాయని భర్త ప్రభాకర్‌ను విచారిస్తున్నారు. రెండు రోజులుగా ఇంట్లో లేడని, చెన్నై వెళ్లిపోయానని ప్రభాకర్ పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

కల్పనా వ్యక్తిగత జీవితం: కల్పన రాఘవేంద్ర సంగీత కుటుంబంలోనే జన్మించారు. తండ్రి TS రాఘవేంద్ర. అతను ప్రముఖ నేపథ్య గాయకుడు, ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమె తమ్ముడు షికినా షాన్ ఒక ఒపెరా సింగర్. ఇక కల్పన మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిగ్రీని పూర్తి చేశారు. మధురై టి. శ్రీనివాసన్ దగ్గర సింగర్ గా శిక్షణ తీసుకున్నారు. ఐదేళ్ల వయసులోనే కుటుంబం అనే సినిమాలో పాట పాడింది. అప్పట్నుంచి గాయనిగా రాణిస్తూనే ఉంది. ఎన్నో వేల షోస్‌ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 1500కి పైగా పాటలు పాడింది. 3000కు పైగా షోలు చేసింది.

ఇక కల్పన 2010లో స్టార్ సింగర్ మలయాళం రియాలిటీ షోలో పాల్గొని ఆ షో టైటిల్ గెలుచుకుంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ తెలుగు (సీజన్ 1) షోలో కూడా కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసింది. 28వ రోజున ఎలిమినేట్ అయింది. కల్పన సూపర్ సింగర్, సూపర్ సింగర్ జూనియర్, స్టార్ సింగర్ వంటి అనేక రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా కూడా పనిచేశారు.

కల్పనా భర్త: కల్పన భర్త ప్రసాద్‌ ప్రభాకర్‌. అతను వ్యాపారవేత్త. ఆయన చెన్నైలోనే ఉంటున్నారని సమాచారం. అయితే, తన 19ఏళ్ల కూతురుని ఆయనే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రసాద్ కి కల్పన సింగర్ గా ఉండటం నచ్చట్లేదని తెలుస్తోంది. తరచూ ఈ విషయమై వీరి మధ్య గొడవలు జరిగేవని సమాచారం. ఈ విషయంలోనే వీరి మధ్య గ్యాప్ కి కారణమని తెలుస్తోంది. మంగళవారం రాత్రి (మార్చి 4న) కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంఘటనలో కల్పన భర్త ప్రసాద్ ని ఇప్పటికే హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కల్పన రోజూ వేసుకునే జోల్ ఫ్రెష్ అనే నిద్రమాత్రల్ని ఎక్కువ మోతాదులో వేసుకున్నారని.. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు కల్పనకు భర్త ప్రసాద్ ఫోన్ చేయగా.. ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో విల్లా సెక్రటరీకి ప్రసాద్ కాల్ చేసి విషయం చెప్పారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించగా.. ఆ తర్వాత ఆస్పత్రిలో చేర్పించారు. కల్పన కోలుకున్నాక.. ఆమెను పోలీసులు విచారించిన తర్వాతే అసలు నిజాలు బయటకొచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News