ప్రముఖ సింగర్ కల్పన(Singer Kalpana) ఆరోగ్యం నుంచి కోలుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితితో పాటు ఇటీవల జరిగిన పరిణామాలపై ఓ వీడియో విడుదల చేశారు. తనతో పాటు తన భర్త గురించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని వాపోయారు. 45 ఏళ్లు వచ్చిన తాను పీహెచ్‌డీతో పాటు ఎల్‌ఎల్‌బీ చేస్తున్నట్లు తెలిపారు. తన భర్త ప్రోత్సహం వల్లే సాధ్యం అవుతోందని చెప్పారు. మరోవైపు మ్యూజికల్ కాన్సర్ట్స్‌లో పాల్గొంటున్నానని పేర్కొన్నారు. ఒకేసారి ఇన్ని పనులు చేయడంతో చాలా కాలంగా తనకు నిద్ర కరువైందన్నారు.
ఇన్సోమియా ట్రీట్‌మెంట్ తీసుకునే క్రమంలో డోస్ ఎక్కువైందని.. అందుకే స్పృహ తప్పి పోయానని చెప్పుకొచ్చారు. ఇవాళ తాను బతికి ఉన్నానంటే తన భర్తే కారణమన్నారు. ఆయన అందుబాటులో లేకపోయినా కాలనీ వాళ్లకు, పోలీసులకు సమాచారం అందజేసి సకాలంలో ఆసుపత్రికి తనను తీసుకెళ్లేలా చేశారని వివరించారు. ఇక తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని ఫేక్ వార్తలను నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు.