Friday, June 13, 2025
Homeచిత్ర ప్రభMangli: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. మంగ్లీ సెల్ఫీ వీడియో వైరల్

Mangli: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. మంగ్లీ సెల్ఫీ వీడియో వైరల్

ప్రముఖ సింగర్ మంగ్లీ(Mangli)పుట్టినరోజు వేడుకల్లో భారీగా విదేశీ మద్యం, గంజాయి వాడకం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. చేవెళ్లలోని త్రిపురరిసార్ట్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన వేడుకలపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ మంగ్లీతో సహా మరికొందరిపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటనపై స్పందిస్తూ మంగ్లీ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. లిక్కర్ పార్టీకి అనుమతి తీసుకోవాలని తనకు తెలియదని తెలిపింది.

“అందరకీ నమస్కారం.. నా పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో మా అమ్మానాన్నల కోరిక మేరకు కుటుంబసభ్యులు, బంధువులతో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు కూడా ఉన్నారు. మద్యం, సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. మద్యం, సౌండ్ సిస్టమ్‌కు అనుమతి తీసుకోవాలనే విషయంపై నాకు అవగాహన లేదు. ఎవరైనా చెప్పి ఉంటే అనుమతి తీసుకునేదాన్ని. రిసార్ట్‌లో పార్టీ అనుకోకుండా సడన్‌గా ప్లాన్ చేసుకోవడం జరిగింది. నాకు తెలిసి ఉంటే తప్పకుండా అనుమతి తీసుకునేదాన్ని. అనుమతి తీసుకోవాలనే విషయం నాకు ఎవరూ చెప్పలేదు. తెలిసి అయితే నేను ఎలాంటి తప్పు చేయలేదు.

రిసార్ట్‌లో లోకల్ లిక్కర్ తప్ప ఎలాంటి ఇతర మత్తు పదార్థాలు అక్కడ లేవు. వాడలేదు. పోలీసులు సెర్చ్ చేసినా ఎలాంటి మత్తు పదార్థాలు దొరకలేదు. గంజాయి తాగినట్టు ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో ఆ వ్యక్తి వేరే ఎక్కడో ఎప్పుడో తీసుకున్నట్టు తేలిందని పోలీసులే చెప్పారు. దానిపై విచారణ కూడా జరుగుతోంది. మేం కూడా పోలీసులకు సహకరిస్తున్నాం. నాకు తెలిసి ఎందుకు ఇలా చేస్తాను. మా అమ్మా, నాన్నలను దగ్గర పెట్టుకొని ఇలాంటివి ప్రోత్సహిస్తానా? ఒక రోల్‌ మోడల్‌గా ఉండాలనుకుంటాను కానీ, ఇలాంటివి ఎందుకు చేస్తాను. మీడియా మిత్రులకు నా విన్నపం.. దయచేసి ఆధారాలు లేని అభియోగాలు నాపై మోపొద్దు.. ప్లీజ్‌” అంటూ తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News