Tuesday, February 18, 2025
Homeచిత్ర ప్రభRevanvitha : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ రేవంత్ భార్య అన్విత

Revanvitha : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ రేవంత్ భార్య అన్విత

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో టాప్ 8 కంటెస్టంట్స్ లో ఒకరిగా ఉన్న సింగర్ రేవంత్ తండ్రయ్యాడు. అతని భార్య అన్విత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొద్దిసేపటిక్రితమే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది అన్విత. ప్రస్తుతం టాప్ కంటెస్టంట్ గా ఉన్న సింగర్ రేవంత్ టైటిల్ గెలుస్తాడో లేదో తెలియకముందే.. అతని ఇంట సంబరాలు మొదలయ్యాయి. హౌస్ లోకి లాస్ట్ కంటెస్టంట్ గా వెళ్లాడు రేవంత్. అప్పటికే అన్విత గర్భిణి.

- Advertisement -

గర్భిణి అయిన తన భార్యను వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉన్నా.. తనకు పుట్టబోయే బిడ్డకు తనగెలుపుని బహుమతిగా ఇస్తానని చెప్పాడు రేవంత్. ఆ తర్వాత అన్విత సీమంతంవేడుకకు సంబంధించిన ఫొటోలను రేవంత్ కోసం చూపించాడు బిగ్ బాస్. ఫ్యామిలీ ఎపిసోడ్ లో ఆదిరెడ్డి కూతుర్ని చూసి.. బాగా ఎమోషనల్ అయ్యాడు రేవంత్. తనకు తండ్రి లేని లోటు తెలుసని, అందుకే తానెప్పుడు నాన్నను అవుతానా అని ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. డిసెంబర్ 1న అన్విత పాపకు జన్మనివ్వగా.. నెటిజన్లు, సెలబ్రిటీలు రేవాన్వితలకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News