Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభSatya Yamini : నిశ్చితార్థం చేసుకున్న బాహుబలి సింగర్..

Satya Yamini : నిశ్చితార్థం చేసుకున్న బాహుబలి సింగర్..

- Advertisement -

Satya Yamini : బాహుబలి సినిమాలో మమతల తల్లి.. పాటతో ఒక్కసారిగా పాపులర్ అయింది సింగర్ సత్య యామిని. పాడుతా తీయగా, స్వరాభిషేకం లాంటి ప్రోగ్రామ్స్ తో కెరీర్ ని మొదలుపెట్టిన సత్య యామిని సింగర్ గా పలు సినిమాల్లో పాటలు పాడింది. బాహుబలి సినిమా సాంగ్ మంచి హిట్ అవ్వడంతో తర్వాత సత్య యామినికి అవకాశాలు బాగానే వచ్చాయి. తెలుగు, తమిళ్ లో అనేక సినిమాల్లో పాటలు పాడుతూ అలరిస్తుంది యామిని.

సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటూ ఫొటోలు, రీల్స్ అప్లోడ్ చేస్తుంది. తాజాగా తనకి కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసి తాము ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు, జీవితకాల ప్రయాణాన్ని ప్రారంభించినట్టు తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో పలువురు సింగర్స్, సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకి కంగ్రాట్స్ చెప్తున్నారు. త్వరలోనే వీరు పెళ్లిపీటలెక్కనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad