Sunday, February 23, 2025
Homeచిత్ర ప్రభSivakarthikeyan: శివ‌కార్తికేయ‌న్ మూవీకి ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌

Sivakarthikeyan: శివ‌కార్తికేయ‌న్ మూవీకి ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌

వరుస సినిమాలతో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవలే ‘అమ‌ర‌న్’ సినిమాతో బ్లాక్‌బాస్టర్ సొంతం చేసుకున్నాడు. తాజాగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ‘ఎస్‌కే 23’ వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం గ్లింప్స్ మేకర్స్ విడుద‌ల చేశారు. శివ‌కార్తికేయ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా గ్లింప్స్‌తో పాటు సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈ సినిమాకు ‘మదరాసి'(Madharasi) అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. ఈ గ్లింప్స్‌లో పవర్‌పుల్ లుక్‌లో శివకార్తికేయన్ అదరగొట్టాడు.

- Advertisement -

శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తుండగా.. సుదీప్ ఎలామోన్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వ‌సంత‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో విద్యుత్ జ‌మాల్‌, బీజు మీన‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News