Tollywood Movies: ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో కొత్త హీరోలు, దర్శకులు తమ లక్‌ను పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు ఏవంటే?
కొత్తపల్లిలో ఒకప్పుడు…
రానా దగ్గుబాటి (Rana Daggubati) నిర్మాతగా వ్యవహరిస్తున్న చిన్న సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు ఈ ఫ్రైడే థియేటర్లలోకి రాబోతుంది. కేరాఫ్ కంచెరపాలెం సినిమాను నిర్మించిన ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri) కొత్తపల్లిలో ఒకప్పుడు (Kothapalli Lo Okappudu) మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మనోజ్ చంద్ర, మోనిక, ఉషా, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కేరాఫ్ కంచెరపాలెం తరహాలోనే మరో ఫీల్‌గుడ్ మూవీగా కొత్తపల్లిలో ఒకప్పుడు నిలుస్తుందో లేదో అన్నది ఈ శుక్రవారం తేలనుంది.
Also Read – Nara Lokesh: నారా లోకేష్ ట్వీట్‌కు కర్ణాటక మంత్రి కౌంటర్
జూనియర్
మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా నటిస్తున్న జూనియర్ (Junior) మూవీ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో కిరీటికి జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా కీలక పాత్రలో నటిస్తున్న రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీలీలకు తెలుగులో ఉన్న ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా ఈ వారం విడుదలవుతోన్న సినిమాల్లో జూనియర్‌పైనే ఎక్కువ అంచనాలు నెలకొన్నాయి.
మరో నాలుగు…
ఈ రెండుతెలుగు సినిమాలే కాకుండా బిగ్‌బాస్ ఆదిత్య ఓం హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సంత్ తుకారంతో పాటు పోలీస్ వారి హెచ్చరిక, వీడే మనవారసుడు, మిస్టర్ రెడ్డి కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మై బేబీ…
అధర్వ మురళి, నిమిషా సజయన్ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ మూవీ డీఎన్ఏ తెలుగులో మై బేబీ పేరుతో జూలై 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించాడు. ఈ లవ్ థ్రిల్లర్ మూవీ తమిళంలో యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
Also Read – Viral: అమెరికాలో భారతదేశ పరువు తీసిన యువతి.. అసలేం జరిగిందంటే?
ఏ మాయ చేశావే రీ రిలీజ్…
నాగచైతన్య (Naga Chaitanya), సమంత (Samantha) జంటగా నటించిన కల్ట్ క్లాసిక్ లవ్‌స్టోరీ ఏ మాయచేశావే మరోసారి ప్రేక్షకులముందుకు వస్తోంది. జూలై 18న థియేటర్లలో రీ రిలీజ్ అవుతోంది. ఈ లవ్‌స్టోరీతోనే సమంత హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏ మాయ చేశావే మూవీకి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించాడు.


