Smriti Irani: గత కొన్ని రోజులు ముందు బాలీవుడ్‌లో పని గంటలపై వివాదం డిస్కషన్ పాయింట్‌గా మారింది. అందుకు కారణం దీపిక తాను చేయాలనుకున్న స్పిరిట్, కల్కి 2 సినిమాల విషయంలో ఈ నిబంధనలను పాటించాలని మేకర్స్‌కు కండీషన్స్ పెట్టింది. సదరు సినిమాల మేకర్స్ ఆమెను ఆయా సినిమాల నుంచి తొలగించారు. దీంతో వివాదం మరింతగా పెరిగింది. దీనిపై ముందుగా దీపికా పదుకొణె స్పందించలేదు. కానీ రీసెంట్‌గా ఆమె ఓ మీడియా దగ్గర ఈ విషయంపై స్పందించింది. ‘బాలీవుడ్‌లో చాలా మంది సూపర్‌స్టార్స్ రోజుకు 6 నుండి 8 గంటలపాటు మాత్రమే పనిచేస్తారు. శనివారం, ఆదివారాలు పని చేయరు. కానీ వారిని ఎవరూ ప్రశ్నించరు. వారి గురించి రాయరు. కానీ మనల్ని మాత్రం విమర్శిస్తారు’ అని దీపిక పేర్కొంది. దీనిపై విమర్శించిన వాళ్లున్నారు.. మద్ధతు తెలిపినవారున్నారు.
తాజాగా ఈ వివాదంపై సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీ రియాక్ట్ అయ్యారు. ‘పని గంటలపై ఇండస్ట్రీలో ప్రస్తుతం పెద్ద వివాదం నడుస్తోంది. కొంతమంది దీనిని మరింత పెంచి నెగటివ్‌గా చర్చించడంలో నిమగ్నమయ్యారు. కానీ నేను ఈ వివాదంలో ఇరుక్కోవాలని అనుకోవటం లేదు. దీపికా పదుకొణెని పెద్ద సినిమాల నుంచి నిర్మాతలు తీసేసిన విషయం ఆమె వ్యక్తిగతం. దాని గురించి మాట్లాడాలని నాకు ఆసక్తి లేదు’ అని స్మృతి ఇరానీ అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నాకు ఎప్పుడూ నా పని పట్ల అంకితభావం ఉంది. నేను ఎంత కష్టపడినా.. నిర్మాతలకు లాభం తీసుకురావడం గురించే ఆలోచిస్తాను. నేను సీరియల్స్ చేస్తున్న సమయంలో నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అయినా నా పిల్లలను చూసుకుంటూ, షూటింగ్ లో పాల్గొనటం ద్వారా 120 మంది కుటుంబాలకు నష్టం కలగకుండా చూసుకున్నాను. నా కష్టాలు, నా బాధ్యతలు ఇవన్నీ నా ఇష్టానుసారంగా జరిగినవే. రాజకీయాల్లో, సినిమాల్లో, పిల్లల్ని చూసుకోవడంలో బ్యాలెన్స్‌డ్‌గా స్పందిస్తాను. యాక్టర్‌గా ఎప్పుడూ నిర్మాతలకు నష్టం కలగకుండా ఉండేందుకు నేను కష్టపడతాను’ అని స్మృతి పేర్కొన్నారు. ప్రస్తుతం క్యూంకీ సాస్ భీ కభీ బహు థీ 2 లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
View this post on Instagram
నిజానికి దీపికా పదుకొణె ఇప్పుడిప్పుడే సౌత్ సినిమాలు, డైరెక్టర్స్‌తో పని చేయటానికి సిద్ధమైంది. ఇప్పటికే కల్కి సినిమాతో హిట్ సాధించిన ఆమె దానికి కొనసాగింపుగా కల్కి 2లో నటించాల్సి ఉంది. అదే సమయంలో సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయటానికి ఓకే చేసింది. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో నటించటానికి ఒప్పుకుంది. అయితే 8 గంటలు మాత్రమే పని చేస్తాననే కండీషన్ పెట్టటంతో పాటు తనకు అనుగుణంగా షిఫ్ట్ మార్చాలంటూ చెప్పటంతో మేకర్స్ ఆమెను స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి తొలగించారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మళ్లీ నటనా రంగం వైపు అడుగులు వేశారు. రెండు దశాబ్దాల తర్వాత బుల్లి తెర ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమయ్యారు. ‘క్యొంకీ సాస్ భీ కభీ బహు థీ 2’లో ఆమె నటిస్తున్నారు.
Also Read- Megastar Chiranjeevi: మెగాస్టార్‌కు జోడీగా కోలీవుడ్ బ్యూటీ!


