Sobhita Dhulipala: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి పేరున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని నాగేశ్వరరావు నట వారసులుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున, ఆయన కుమారులు నాగచైతన్య, అఖిల్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య ఏ మాయ చేశావే సినిమాతో.. సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో రెండు మత సాంప్రదాయాల ప్రకారం ఎంతో ఘనంగా జరిగిన వీరి వివాహం కొన్ని అనుకోని కారణాల వల్ల విడాకుల దారి పట్టింది.
ఆ తర్వాత సమంత రెండో పెళ్ళి చేసుకోకపోయినప్పటికీ, నాగచైతన్య మాత్రం హీరోయిన్ శోభితను మళ్ళీ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అయితే, తాజాగా శోభిత.. సమంత గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వీడియో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో శోభిత ‘ది నైట్ మేనేజర్ సీజన్ 2’ విడుదల సమయంలోదని అర్థమవుతోంది. శోభితకు సంబంధించిన ఒక పాత వీడియో ఇప్పుడు బయటకు రావడం, అది కాస్తా వైరల్ కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ కొందరు హీరోయిన్ల గురించి శోభితను అడిగారు. ఇదే, క్రమంలో సమంత గురించి శోభితకి ఓ ప్రశ్న ఎదురైంది.
Also Read- Mirai US Collections: ఓవర్సీస్‌లో ‘మిరాయ్’ మిరాకిల్.. ప్రభాస్, ఎన్టీఆర్ సరసన చేరిన తేజ సజ్జా
సమంతను ఉద్దేశించి శోభిత మాట్లాడుతూ.. సమంత సినీ కెరియర్ సూపర్ కూల్.. తను యాక్ట్ చేసిన సినిమాలను చూస్తే తన పాత్ర ప్రధానంగా ఉంటుంది. సినిమాల విషయంలో సమంత తీసుకునే డెసిషన్స్ చాలా బావుంటాయని చెప్పుకొచ్చింది. ఇక శోభిత.. సమంత గురించి ఒకప్పుడు చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన సమంత ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఇలా సమంత పై ప్రశంసలు కురిపిస్తున్న శోభిత గురించి అభిమానులు చాలా పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు.
అయితే, శోభిత చేసిన కామెంట్స్ కి ముందే నాగ చైతన్య, సమంత విడిపోయారు. మరి, దీని గురించి సమంత స్పదించలేదు. కాగా, సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తోంది. త్వరలో ఆమె నిర్మాణంలో మా ఇంటి బంగారం అనే సినిమా రాబోతోంది. ఇందులో సమంత ఓ ముఖ్య పాత్రను చేస్తోంది. ఇక శోభిత.. అడవి శేష్ సరసన హీరోయిన్‌గా నటించింది. అలాగే, హిందీ సినిమాలలోనూ నటించింది. పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా శోభిత వ్యవహరిస్తోంది.


