Bigg Boss Telugu 9: ఆదివారం సాయంత్రం బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు అత్యంత గ్రాండ్‌గా, సరికొత్త సర్ ప్రైజ్‌లు, ఊహించని ట్విస్టులతో ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా ముద్ద మందారం సీరియల్ ఫేమ్ తనూజ గౌడ అడుగుపెట్టింది. తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మొదటి కామనర్ అయిన కళ్యాణ్ పడాల (Kalyan Padala) అలియాస్ సోల్జర్ కళ్యాణ్. ప్రజల ఓటింగ్ ఆధారంగా బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో విజేతగా నిలిచి ఆయన ఈ అవకాశం దక్కించుకుని బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు.
సోల్జర్ కళ్యాణ్ పూర్తి పేరు పవన్ కళ్యాణ్ పడాల. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఈయన భారత సైన్యంలో సైనికుడు. మూడు సంవత్సరాలుగా దేశ సరిహద్దుల్లో సేవలు అందిస్తున్నారు. కామనర్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకున్న ఆయన బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో తన సత్తా చాటి హౌస్‌లోకి ప్రవేశించారు. హోస్ట్ నాగార్జున స్వయంగా పవన్ కళ్యాణ్‌ను స్టేజ్ పైకి ఆహ్వానించారు. అయితే, హౌస్‌లోకి వెళ్లిన వెంటనే పవన్‌కు ఒక ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. ముందుగా పవన్ కళ్యాణ్, ఫ్లోరా షైనీలను తీసుకుని బాత్‌రూమ్‌లను చూపించాలని తనూజకు కింగ్ నాగార్జున సూచించారు. ఆ తర్వాత కాసేపటికి, ఆ ఇద్దరిలో బాత్‌రూమ్స్ క్లీన్ చేసే బాధ్యతను ఎవరికి అప్పగిస్తావని నాగార్జున పవన్ కళ్యాణ్‌ను అడిగారు.
Also Read- Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దమ్ము శ్రీజ గురించి ఎవరికీ తెలియని విషయాలు!
ఈ సమయంలో పక్కనే ఉన్న ఆశా షైనీ తనకు ఈ బాధ్యత ఇవ్వొద్దని అభ్యర్థించారు. అయితే కళ్యాణ్ మాత్రం మరో మాట లేకుండా వెంటనే ఆమెకే బాత్‌రూమ్ క్లీన్ చేసే బాధ్యతను అప్పగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీంతో ఆశా షైనీ స్పందిస్తూ తనకు కూడా సమయం వస్తుందని, అప్పుడు చూసుకుంటానని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఎంట్రీతోనే ఒక లేడీ కంటెస్టెంట్‌కు షాకిచ్చిన సోల్జర్ కళ్యాణ్, సీజన్ మొత్తం ఎలాంటి ట్విస్టులు తీసుకొస్తారో, ఇంటి సభ్యులతో ఎలా నెట్టుకొస్తారో చూడాలి.
బిగ్‌బాస్ సీజన్ 9 మొదలైంది. ఆడియెన్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. తొమ్మిది మంది సెలిబ్రిటీలు, ఆరుగురు కామన్ మ్యాన్స్‌తో మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో 13 మంది ఫైనల్ చేరుకున్నారు. కానీ వీరిలో ఆరుగురుకి మాత్రమే హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కింది. ముగ్గురు ఓటింగ్ ద్వారా హౌజ్‌లోకి అడుగుపెట్టగా…మరో ముగ్గురిని జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేశారు.
బిగ్‌బాస్ సీజన్ 9లోకి ఫస్ట్ కంటెస్టెంట్‌గా టీవీ సీరియల్ యాక్టర్ తనూజ గౌడ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఫ్లోరా శైనీ (ఆశా శైనీ), జబర్ధస్త్ ఇమాన్యుయేల్, శ్రేష్టి వర్మ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, ఫోక్ సింగర్ రాము రాథోడ్, సుమన్ శెట్టి, భరణి సెలిబ్రిటీలుగా హౌజ్‌లోకి అడుగుపెట్టారు.
Also Read- Bigg Boss: జనసైనికులు రెడీయా.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లగానే నాగబాబు పోస్ట్
ఇక కామన్ మ్యాన్స్ నుంచి ఆగ్ని పరీక్షలో ఫైనల్‌కు చేరిన పదమూడు మందిలో.. ఆరుగురు బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టే ఛాన్స్ దక్కించుకున్నారు. కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, శ్రీజ దమ్ము, ప్రియా శెట్టి, హరిత హరీష్, మర్యాద మనీష్ ఓటింగ్‌తో పాటు జ్యూరీ మెంబర్స్ ద్వారా కంటెస్టెంట్స్‌గా ఎంపికయ్యారు.


