Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభKantara: థియేటర్ కి వచ్చిన ముస్లిం జంట.. అడ్డుకున్న ముస్లిం యువకులు!

Kantara: థియేటర్ కి వచ్చిన ముస్లిం జంట.. అడ్డుకున్న ముస్లిం యువకులు!

- Advertisement -

Kantara : కాంతార సినిమా దేశమంతటా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓటీటీలోకి వచ్చినా ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది. ఈ సినిమాని థియేటర్స్ లో చూడటానికే జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాంతార సినిమాలో హిందూ సంసృతి, సంప్రదాయాలు, కర్ణాటక లోకల్ తెగ సంప్రదాయాలు అద్భుతంగా చూపించారు. ఈ సినిమాని దేశవ్యాప్తంగా అందరూ మెచ్చుకున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన సంచలనం సృష్టిస్తుంది.

కేరళలో కాంతార సినిమా చూడటానికి ఓ ముస్లిం జంట వెళ్ళింది. అయితే వారు థియేటర్ లోపలి వెళ్లే లోపే కొంతమంది ముస్లిం యువకులు వచ్చి.. ఇది హిందువులకి సంబంధించిన సినిమా ముస్లిమ్స్ చూడకూడదు, వెళ్లిపోండి అని భయపెట్టారు. వెళ్లకపోతే దాడి చేస్తామని కూడా బెదిరించారు. దాంతో ఆ జంట సినిమా చూడకుండానే భయపడి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

దీనిపై బాధితులు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. అయితే ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులే బాధితుల్ని కనుక్కొని కంప్లైంట్ తీసుకొని బెదిరించిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో బెదిరించిన వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News