Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSoubin Shahir : కూలీ నటుడి కొత్త బిఎమ్‌డబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Soubin Shahir : కూలీ నటుడి కొత్త బిఎమ్‌డబ్ల్యూ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Soubin Shahir : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్న సినిమా ‘కూలీ’. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ ఆగస్టు 14, 2025న విడుదలైంది. మూడు రోజుల్లోనే ఇండియాలో రూ.158 కోట్లు నెట్ కలెక్ట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు దాటి సంచలనం సృష్టించింది. రజినీతో పాటు నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, ఆమీర్ ఖాన్ లాంటి స్టార్లు నటించారు. కానీ, ఈ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటుడు మలయాళీ యాక్టర్ సౌబిన్ షాహిర్.

- Advertisement -

ALSO READ : Anupama Parameswaran: ఆ రూమ‌ర్ వ‌ల్ల‌ ఆరు నెల‌లు ఒక్క ఛాన్స్ రాలేదు – చేయ‌ని త‌ప్పుకు శిక్ష అనుభ‌వించా – రామ్‌చ‌ర‌ణ్ మూవీపై అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కామెంట్స్

సౌబిన్ షాహిర్ 1986 ఏప్రిల్ 29న కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో జన్మించాడు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఆపై 2013లో ‘అన్నయుం రసూలుం’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 2015లో ‘ప్రేమం’ సినిమాతో బ్రేక్‌ వచ్చింది. 2017లో ‘పరవా’ సినిమాతో డైరెక్టర్‌గా మారి, 2018లో ‘సుడాని ఫ్రమ్ నైజీరియా’లో లీడ్ రోల్‌తో కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకున్నాడు. 2024లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే సర్వైవల్ థ్రిల్లర్‌తో మరిన్ని ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ‘కూలీ’లో కీలక పాత్ర పోషించి, ముఖ్యంగా ‘మోనికా’ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డేతో స్టెప్పులు వేసి ఓవర్‌ నైట్ లో స్టార్ అయ్యాడు. సోషల్ మీడియాలో అతడి డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా, సౌబిన్ కొత్త లగ్జరీ కారు BMW XM కొనుగోలు చేశాడు. ఈ కారు ధర సుమారు రూ.3.30 కోట్లు. కుటుంబంతో కలిసి కారు డెలివరీ తీసుకుని ఫోటోలు దిగాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మలయాళంలో హీరోగా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న సౌబిన్, ‘కూలీ’తో పాన్ ఇండియా ఫాలోయింగ్ సంపాదించాడు. భవిష్యత్తులో మరిన్ని హిట్స్‌తో ముందుకు వెళ్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad