South Heroines: ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా హీరోయిన్ల కెరీర్ ప్లానింగ్‌పై అభిమానుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. సినిమా నాయికలతో పాటు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్, కాంతార చిత్రాల హీరోయిన్ల ప్రస్తుత పరిస్థితి, కెరీర్ ప్రణాళికలు ఏంటో తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి భవిష్యత్ ప్రణాళికలపై ఓ లుక్కేద్దాం…
తమన్నా….
తమన్నా భాటియా సౌత్‌తో పోలిస్తే నార్త్‌లోనే ఎక్కువగా బిజీగా ఉన్నారు. ‘ముద్దులకి హద్దు చెరిపేశాను’ అంటూ ఈ మధ్య ఆమె చేసిన స్టేట్‌మెంట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సినిమాల కంటే ఈ మధ్య స్పెషల్ సాంగ్స్ లో ఆమె అభిమానులను మురిపిస్తోంది. ఇక సౌత్ విషయానికి వస్తే.. శక్తివంతమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్న తమన్నా, బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్‌లో తన కెరీర్ ప్రణాళికలను పంచుకుంటారేమో చూడాలి.
అనుష్క శెట్టి…
అనుష్క శెట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి కూడా సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్‌కి ఏమాత్రం తగ్గలేదు. కానీ, అనుష్క మాత్రం అప్పుడప్పుడు మాత్రమే తెరపై తళుక్కుమంటున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ఆ మధ్య కాస్త సందడి చేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం ఘాటి సినిమాపై దృష్టి సారించారు. ఘాటితో హిట్ అందుకొని తీరాల్సిన కంపల్సరీ సిట్యువేషన్‌లో అనుష్క ఉన్నారని చెప్పొచ్చు.
Also Read – Samantha: మెగా ఫోన్ పట్టుకోబోతుందా..?
శ్రీనిధి శెట్టి…
పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి గురించి మాట్లాడుకున్న ప్రతిసారీ, కేజీఎఫ్ కూడా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది. కేజీఎఫ్ అనగానే శ్రీనిధి శెట్టి గుర్తుకు రాకుండా ఉండదు. మొదటి పార్ట్ కన్నా కూడా రెండవ పార్ట్‌లో రాకీ భాయ్… శ్రీనిధి కెమిస్ట్రీ అద్భుతంగా పండిందనే మాటలు బలంగా వినిపించాయి. ఇటీవల విడుదలైన హిట్ 3 లో నానితో జోడి కట్టి, ఆన్ స్క్రీన్ పై మంచి మార్కులే కొట్టేసారు శ్రీనిధి. ఈ ఏడాది హిట్ 3 సక్సెస్ కొట్టిన ఆమె తెలుసు కదా సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. ఈసారి ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి మరి.
సప్తమి గౌడ…
కాంతార సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు సప్తమి గౌడ. ఈ సినిమాతో వచ్చిన ఫేమ్‌తో ఆమెకు అవకాశాలు కూడా చాలా వచ్చాయి. అయితే, సరైన సక్సెస్ లేకపోవడంతో సప్తమి పెద్దగా సందడి చేయలేకపోతున్నారు. ఆమె చేతిలో ఉన్న సినిమాలు క్లిక్ కావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.
మొత్తంగా చూస్తే, ఈ నలుగురు నాయికలు తమ కెరీర్లో కీలక దశలో ఉన్నారని స్పష్టమవుతోంది. వారి రాబోయే చిత్రాలు, కెరీర్ ఎంపికలు వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి. వారి ప్రణాళికలపై ప్రేక్షకుల దృష్టి నిరంతరం కొనసాగుతోంది.
Also Read – Local Elections : స్థానిక ఎన్నికలు, కాళేశ్వరం నివేదిక.. కాంగ్రెస్ కీలక సమావేశాలు


