Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభSpark of The Paradise: ‘ది ప్యారడైజ్’ సాలీడ్ అప్‌డేట్..

Spark of The Paradise: ‘ది ప్యారడైజ్’ సాలీడ్ అప్‌డేట్..

Spark of The Paradise: టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా నానికి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. కానీ, హీరో అన్న తర్వాత మాస్ ఇమేజ్ కోసమే అందరూ ట్రై చేస్తుంటారు. నానీ కూడా అదే దారిలో వెళుతున్నాడు. ‘జెంటిల్ మేన్, వి, కృష్ణార్జున యుద్ధం, సరిపోదా శనివారం, దసరా, హిట్ 3’.. లాంటి మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌‌లో ‘ది ప్యారడైజ్’ అనే పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

ఈ సినిమా నాని కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఎస్‌ ఎల్‌ వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయాల్ విలన్ పాత్రను పోషిస్తున్నాడు. తెలుగు తో పాటు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషలలో రిలీజ్ కాబోతోంది. ఇలా మొత్తం 8 భాషల్లో విడుదల కాబోతున్న నాని ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ మూవీ 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

Also Read- War2 Review: వార్ 2 ఫ‌స్ట్ రివ్యూ – ఫ‌స్ట్ హాఫ్‌లో ఎన్టీఆర్ డామినేష‌న్ – ఇంట‌ర్వెల్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్‌…

‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని ఇంతకముందెన్నడూ కనిపించని లుక్‌లో అలరించబోతున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడే, అందరి దృష్ఠిని ఆకర్షించింది. అంతేకాదు, గ్లింప్స్ లో ఉన్న డైలాగ్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఇక నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నట్లుగా ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ మధ్యనే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించారు. ఇది కంప్లీట్ అయిన సందర్భంగా మేకర్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జైలు వరల్డ్ నేపథ్యంలో దాదాపు 15 రోజుల షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఇక, తాజాగా వదిలిన వీడియో ప్రకారం, జైలులో గొడవ జరుగుతుంది. నాని ఒంటరిగా.. నిరాయుధుడిగా.. నిస్సహాయంగా కనిపిస్తున్నాడు. తోటి ఖైదీలు కత్తులతో దాడికి వస్తారు. కానీ ‘జడల్’ కుర్చీలో కూర్చుని ధైర్యంగా ఉంటాడు. ఈ సందర్భంలో ‘జడల్’ ను పట్టుకుంటే సర్రమంటుంది.. అనే డైలాగ్ వినిపిస్తుంది. ఇది నెక్స్ట్ లెవల్ లో ఉంది. ఇప్పటి వరకూ నాని ఇలాంటి రోల్ లో కనిపించలేదు. హిట్ 3‌లో వయలెన్స్ బాగా ఎక్కువుందని మాట్లాడుకున్నారు. అంతకుమించి ‘ది ప్యారడైజ్’లో ఉండబోతుందని తాజా గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.

Also Read- Vairamuthu: రాముడిపై కవి వైరముత్తు వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమన్న బీజేపీ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad