Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభLos Angeles Times : రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. హాలీవుడ్ న్యూస్ పేపర్లో..

Los Angeles Times : రాజమౌళికి మరో అరుదైన గౌరవం.. హాలీవుడ్ న్యూస్ పేపర్లో..

- Advertisement -

Los Angeles Times : RRR సినిమా తర్వాత రాజమౌళి మరింత పాపులర్ అయ్యారు. రాజమౌళి టేకింగ్ కి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా అందరూ ఫిదా అయిపోయారు. రాజమౌళిని హాలీవుడ్ లో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గత రెండు నెలలుగా అమెరికాలోనే ఉంటూ RRR సినిమాని మరింత ప్రమోట్ చేస్తున్నాడు రాజమౌళి. వరుసగా హాలీవుడ్ మీడియాతో, ప్రేక్షకులతో మాట్లాడుతున్నాడు జక్కన్న.

తాజాగా రాజమౌళికి మరో గౌరవం దక్కింది. అమెరికాలో టాప్ న్యూస్ పేపర్స్ లో ఒకటైన లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రికలో రాజమౌళిపై స్పెషల్ ఆర్టికల్ రాశారు. ఆ పేపర్లో ఒక పేజీ మొత్తం రాజమౌళి కోసం కేటాయించారు. హాఫ్ పేజీలో రాజమౌళి ఫోటో వేసి RRR డైరెక్టర్ రాజమౌళి, హాలీవుడ్ లో టాలీవుడ్ సంచలనం అని స్పెషల్ ఆర్టికల్ రాశారు. ఈ ఆర్టికల్ లో RRR సినిమాని, రాజమౌళి గురించి అద్భుతంగా పొగుడుతూ రాశారు. దీంతో మరోసారి రాజమౌళిని అందరూ ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News