Sree Vishnu: కామెడీ కథాంశాలతో శ్రీవిష్ణు చేసిన ఓం భీమ్ బుష్, సామజవరగమనా, సింగిల్ సినిమాలు పెద్ద హిట్టయ్యాయి. ఈ హ్యాట్రిక్ సక్సెస్‌ల తర్వాత తన రూటు మార్చాడు శ్రీవిష్ణు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ మూవీ చేయబోతున్నాడు. దసరా సందర్భంగా శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ రివీల్ చేశారు. కామ్రేడ్ కళ్యాణ్ గా పేరును ఖరారు చేశారు. ఈ యాక్షన్ కామెడీగా మూవీకి జానకిరామ్ మల్లెల దర్శకత్వం వహిస్తున్నాడు.
నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో…
టైటిల్‌తో పాటు ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. 1992 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనున్నట్లు వెల్లడించారు. నక్సలిజం సమస్య గురించి రేడియో అనౌన్స్‌మెంట్‌తో కామ్రేడ్ కళ్యాణ్ ప్రోమో ఆసక్తికరంగా మొదలైంది. శ్రీవిష్ణు నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నట్లు చూపించారు. అతడిని పట్టించిన వారికి ఐదు లక్షల రివార్డ్ అంటూ గోడలపై పోస్టర్స్ కనిపించడం ఈ ప్రోమోలో ఆకట్టుకుంటోంది.
ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఉన్న మాడుగుల అనే విలేజ్ నేపథ్యంలో కామ్రేడ్ కళ్యాణ్ మూవీ సాగనుంది. నక్సలిజం, పోలీసుల మధ్య పోరాటం చుట్టూ అల్లుకున్న ఓ ప్రేమకథతో దర్శకుడు జానకిరామ్ మల్లెల ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రేమికుడిగా, నక్సలైట్‌గా ఈ సినిమాలో శ్రీవిష్ణు డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు.
Also Read – Raju Gari Gadhi 4: రాజుగారి గది 4 వచ్చేస్తోంది – ఈ సారి డివోషనల్ టచ్‌తో – రిలీజ్ డేట్ కన్ఫామ్
మహిమా నంబియార్ హీరోయిన్…
కామ్రేడ్ కళ్యాణ్ మూవీలో శ్రీవిష్ణుకు జోడీగా మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోంది. షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
రామ్ అబ్బరాజుతో సెకండ్ మూవీ…
దసరా రోజు శ్రీవిష్ణు కొత్త సినిమా లాంఛ్ అయ్యింది. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సామజవరగమనా తర్వాత శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సెకండ్ మూవీ ఇది. దసరా సందర్భంగా గురువారం ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో సాయి దుర్గా తేజ్, నారా రోహిత్, వివేక్ ఆత్రేయ పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి భాను భోగవరపు, నందు కథను అందిస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు.
Also Read – Bigg Boss Priya Shetty: నాకు అన్నీ ఎక్కువే.. ఉడుకు రక్తం కదా.. ప్రియా శెట్టి కామెంట్స్ వైరల్


