Sreeleela: టాలీవుడ్‌లో సక్సెస్‌లు లేకపోయినా అవకాశాల రేసులో మాత్రం ముందుంది శ్రీలీల. వరుసగా స్టార్ హీరోలతో జోడీ కడుతోంది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌తో పాటు రవితేజ మాస్ జాతర సినిమాలు చేస్తుంది శ్రీలీల. మాస్ జాతర మూవీ ఈ ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల రిలీజైన టీజర్, పాటలతో రవితేజ మార్కు పక్కా మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ఇదని అభిమానులకు ముందుగానే హింట్ ఇచ్చేశారు మేకర్స్. మాస్ జాతర టీజర్‌లో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది శ్రీలీల.
ధమాకా తర్వాత…
రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న సెకండ్ మూవీ ఇది. మాస్ జాతర కంటే ముందు ధమాకాతో ఈ జోడీ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ధమాకా మూవీతోనే టాలీవుడ్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకుంది శ్రీలీల. ధమాకా సక్సెస్‌ను మాస్ జాతర రిపీట్ చేస్తుందా? లేదా? అన్నది టాలీవుడ్ వర్గాలతో పాటు రవితేజ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read – Driverless bus : భవిష్యత్ రవాణాకు బాటలు.. ఐఐటీ హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ బస్సుల జైత్రయాత్ర!
సెకండ్ మూవీ సెంటింమెంట్…
రవితేజతో సెకండ్ మూవీ సెంటిమెంట్ చాలా మంది హీరోయిన్లకు కలిసి రాలేదు. ఒక్క శృతి హాసన్ మినహా రవితేజతో రెండోసారి జట్టు కట్టిన హీరోయిన్లు ఎవరూ సక్సెస్‌లను దక్కించుకోలేకపోయారు. రవితేజ, శృతిహాసన్ కలయికలో వచ్చిన బలుపు, క్రాక్…. రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. టాప్ హీరోయిన్లు అనుష్క, నయనతారతో పాటు సంగీత, కళ్యాణి…. రవితేజతో రెండేసి సినిమాలు చేశారు. ఫస్ట్ మూవీతో హిట్టు అందుకున్న ఈ ముద్దుగుమ్మలకు రెండో సినిమాలు మాత్రం నిరాశనే మిగిల్చాయి. రవితేజతో అనుష్క విక్రమార్కుడు, బలాదూర్ సినిమాలు చేసింది. విక్రమార్కుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా… బలాదూర్ డిజాస్టర్ అయ్యింది. రవితేజ, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ దుబాయ్ శీను బ్లాక్‌బస్టర్ అవ్వగా… సెకండ్ మూవీ ఆంజనేయులు ఫ్లాపయ్యింది.
రేర్ ఫీట్…
అనుష్క, నయనతార మిస్సయిన ఈ రేర్ ఫీట్‌ను మాస్ జాతరతో శ్రీలీల సాధిస్తుందా? శృతి హాసన్ తర్వాత రవితేజతో రెండో హిట్టు కొట్టిన నాయికగా నిలుస్తుందా? అన్నది అభిమానుల్లో ఉత్కంఠను పంచుతోంది.
పోలీస్ కథలు…
క్రాక్, మాస్ జాతర రెండు పోలీస్ కథలే కావడం గమనార్హం. క్రాక్ మూవీలో నిజాయితీ, ధైర్యం కలగలసిన మాస్‌పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ కనిపించాడు. మాస్ జాతరలో ఇంచుమించు అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు. రవితేజకు కూడా కాప్ స్టోరీస్ కలిసివచ్చాయి. పోలీస్ కథలతో అతడు చేసిన అన్ని సినిమాలు హిట్టయ్యాయి. మాస్ జాతరతో ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయడం ఖాయమని ఫ్యాన్స్ చెబుతున్నారు.
కాగా శ్రీలీల ఈ ఏడాది బాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. హిందీలో ఆషికి 3 మూవీలో కార్తీక్ ఆర్యన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి మూవీలో కథానాయికగా కనిపించబోతున్నది శ్రీలీల.
Also Read – Puja Flower Rules: ఇంట్లో దేవుడికి పువ్వులు సమర్పించడానికి కూడా నియమాలున్నాయని తెలుసా?


