Sreeleela: శ్రీలీల బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతోంది. హిట్టు కొట్టాలనే ఈ బ్యూటీ కల ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. రవితేజ మాస్ జాతరపై భారీగానే ఆశలు పెట్టుకుంది శ్రీలీల. గతంలో రవితేజ, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన ధమాకా వంద కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. మళ్లీ రవితేజ మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశపడింది.
కానీ శ్రీలీల ఒకటి తలిస్తే రిజల్ట్ మాత్రం మరోలా వచ్చింది. తొలిరోజే మాస్ జాతర మూవీ డివైడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రీమియర్స్‌తో కలిసి వరల్డ్ వైడ్‌గా రెండు రొజుల్లో మాస్ జాతర మూవీ 9 కోట్ల వరకు వసూళ్లను దక్కించుకున్నది. ఆదివారం రోజు కలెక్షన్స్ కోటి వరకు డ్రాప్ అయ్యాయి. రవితేజకు ఉన్న క్రేజ్ కారణంగా మాస్ జాతర ప్రీ రిలీజ్ బిజినెస్ 32 కోట్ల వరకు జరిగింది. రెండు రోజుల్లో ఈ మూవీ పది కోట్ల మార్కును కూడా టచ్ చేయడం చేయలేకపోయినా ఈ మూవీ నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు షాకిచ్చింది. మాస్ జాతర బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో ఇరవై కోట్లకుపైనే కలెక్షన్స్ రావాలి. డివైడ్ టాక్‌తో ఆ టార్గెట్ రీచ్ కావడం అంటే కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మాస్ జాతర మూవీలో శ్రీలీల ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్‌ను నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. భగవంత్ కేసరి తర్వాత శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ, రాబిన్‌హుడ్, జూనియర్‌తో పాటు మహేష్‌బాబు గుంటూరు కారం డిజాస్టర్స్‌గా నిలిచాయి.
Also Read – Gold Rate: సోమవారం పెరిగిన గోల్డ్.. హైదరాబాదులో తులం రేటు ఎంతంటే..?
కాగా మాస్‌జాతర మూవీలో శ్రీలీల లుక్‌తో పాటు యాక్టింగ్ విషయంలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. శ్రీలీల డ్యాన్సుల్లో జోష్ తగ్గిందనే కామెంట్స్ వచ్చాయి. శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న ఒకే ఒక మూవీ ఇదే. పవన్ కళ్యాణ్ సినిమాతోనైనా హిట్టు కొట్టాలనే శ్రీలీల కల తీరుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది. ఉస్తాద్ భగత్‌సింగ్‌లో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్‌గా రాశీఖన్నా కనిపించబోతున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలపై ఫోకస్ పెడుతోంది శ్రీలీల. పరాశక్తితో తమిళంలోకి, ఆషికి 3 మూవీతో బాలీవుడ్‌లో వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వబోతుంది. పరాశక్తి సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read – Shefali Verma: వచ్చింది కప్పు …పట్టుకొచ్చేసింది!


